LOADING...
Netherlands: నెదర్లాండ్స్‌లో 24 గంటల్లో 3 లక్షలకుపైగా పిడుగులు..
నెదర్లాండ్స్‌లో 24 గంటల్లో 3 లక్షలకుపైగా పిడుగులు..

Netherlands: నెదర్లాండ్స్‌లో 24 గంటల్లో 3 లక్షలకుపైగా పిడుగులు..

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 30, 2026
08:40 am

ఈ వార్తాకథనం ఏంటి

తీవ్రమైన ఎండలతో అల్లాడిన నెదర్లాండ్స్‌లో వారాంతంలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. శనివారం ఉరుములు,మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురవడంతో దేశవ్యాప్తంగా రికార్డు స్థాయిలో 3,01,137 పిడుగులు నమోదయ్యాయి. కేవలం 24 గంటల వ్యవధిలో 3 లక్షలకుపైగా పిడుగులు పడటం నెదర్లాండ్స్ చరిత్రలో ఇదే తొలిసారి కావడం విశేషం. అంతకుముందు గత వారంలో ఒక్క రోజులో 1,88,000 పిడుగులు నమోదవగా, శనివారం ఆ సంఖ్యను భారీగా అధిగమించింది.

వివరాలు 

ప్రతి సెకనుకు సగటున 17 పిడుగులు

ఈ భారీ పిడుగుల ప్రభావంతో పలు ఇళ్లకు మంటలు అంటుకుని కాలిపోయినట్లు అధికారులు తెలిపారు. అంతేకాదు,నెదర్లాండ్స్‌తో పాటు జర్మనీ ఉత్తర ప్రాంతంలో కేవలం 30 నిమిషాల వ్యవధిలోనే 30 వేల పిడుగులు నమోదయ్యాయి. ఈ తీవ్ర ఉరుముల సమయంలో ప్రతి సెకనుకు సగటున 17 పిడుగులు పడినట్లు వాతావరణ నిపుణులు వెల్లడించారు. ఆకస్మికంగా మారిన వాతావరణ పరిస్థితులు రెండు దేశాల్లోనూ ప్రజలను తీవ్ర ఆందోళనకు గురిచేశాయి.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

ఒక్క రోజులో 3,01,137 పిడుగులు..  

Advertisement