Page Loader
BRICS: బ్రిక్స్ కూటమిలో కొత్తగా 6దేశాలకు సభ్యత్వం.. స్వాగతించిన మోదీ
బ్రిక్స్ కూటమిలో కొత్తగా 6దేశాలకు సభ్యత్వం.. స్వాగతించిన మోదీ

BRICS: బ్రిక్స్ కూటమిలో కొత్తగా 6దేశాలకు సభ్యత్వం.. స్వాగతించిన మోదీ

వ్రాసిన వారు Stalin
Aug 24, 2023
02:50 pm

ఈ వార్తాకథనం ఏంటి

బ్రిక్స్ కూటమిలో సభ్యదేశాల సంఖ్య పెరగనుంది. మరో 6 కొత్త దేశాలు బ్రిక్స్ కూటమిలో చేరనున్నాయి. జోహన్నస్‌బర్గ్‌లో జరిగిన 15వ బ్రిక్స్ సమ్మిట్ ఫలితాలను దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రామఫోసా ప్రకటించారు. ఈ సందర్భంగా కొత్తగా ఆరు దేశాలు బ్రిక్స్‌లో చేరబోతున్నట్లు వెల్లడించారు. ఈజిప్ట్, ఇరాన్, సౌదీ అరేబియా, అర్జెంటీనా, ఇథియోపియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) దేశాలు కూటమిలో చేరుతున్నట్లు దక్షిణాఫ్రికా అధ్యక్షుడు అధికారికంగా ప్రకటించారు. కొత్త దేశాల సభ్యత్వం జనవరి 1, 2024 నుంచి అమలులోకి వస్తుందని చెప్పారు. ప్రస్తుతం బ్రిక్స్‌లో బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికా సభ్యదేశాలు ఉండగా, మరో ఆరు దేశాల చేరితో సంఖ్య 11కు చేరనుంది.

మోదీ

బ్రిక్స్ విస్తరణకు భారతదేశం మద్దతు: మోదీ

బ్రిక్ కూటమిలో కొత్త దేశాల చేరికపై ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థల గ్రూపింగ్ విస్తరణను భారత్ స్వాగతిస్తున్నదని అన్నారు. ఈ 3 రోజుల సమావేశాల్లో చాలా సానుకూల ఫలితాలు వెలువడినందుకు తాను సంతోషిస్తున్నట్లు చెప్పారు. బ్రిక్స్ సభ్యదేశాల విస్తరణకు భారతదేశం ఎల్లప్పుడూ మద్దతు ఇస్తుందన్నారు. బ్రిక్స్ విస్తరణకు సంబంధించిన మార్గదర్శక సూత్రాలు, ప్రమాణాలు, ప్రమాణాలు, విధానాలపై తమ సభ్య దేశాలు కలిసి అంగీకరించినందుకు సంతోషిస్తున్నట్లు చెప్పారు. ఆధునిక ప్రపంచంలో కాలానుగూనంగా మారాల్సిన అవసరం ఉందని మోదీ చెప్పారు. అందులో భాగంగానే బ్రిక్స్ కూటమి మారాల్సిన సమయంలో వచ్చిందన్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

కొత్త దేశాల చేరికపై మాట్లాడుతున్న మోదీ 

ట్విట్టర్ పోస్ట్ చేయండి

దక్షిణాఫ్రికా అధ్యక్షుడి ప్రకటన