Andy Burnham: బ్రిటన్‌కు కొత్త ప్రధాని.. లేబర్ పార్టీ నేతగా బర్న్‌హామ్ ఎన్నిక
ఈ వార్తాకథనం ఏంటి
బ్రిటన్‌లో అధికార లేబర్ పార్టీకి కొత్త నాయకత్వం లభించింది. పార్టీ నూతన నేతగా యాండీ బర్న్‌హామ్ ఎన్నికయ్యారు. దీంతో ఆయన బ్రిటన్ తదుపరి ప్రధానిగా బాధ్యతలు చేపట్టడం లాంఛనప్రాయమైంది. వచ్చే వారం ఆయన అధికారికంగా ప్రధానమంత్రి పదవిని స్వీకరించనున్నారు. 56 ఏళ్ల యాండీ బర్న్‌హామ్ ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఉత్తర ఇంగ్లండ్‌లాండ్‌లోని మేకర్‌ఫీల్డ్ నియోజకవర్గం నుంచి పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికయ్యారు. ఇప్పుడు లేబర్ పార్టీ నాయకత్వం చేపట్టడంతో దేశ అత్యున్నత పదవిని అధిరోహించనున్నారు.
వివరాలు
దేశాభివృద్ధికి సహకారం అందిస్తా
ఈ దశాబ్ద కాలంలో బ్రిటన్ ప్రధానమంత్రి పదవిని చేపడుతున్న ఏడో వ్యక్తిగా యాండీ బర్న్‌హామ్ రికార్డు సృష్టించనున్నారు.
మాజీ ప్రధాని కీర్ స్టార్మర్ రాజీనామా చేయాలని నిర్ణయించుకోవడంతో అధికార లేబర్ పార్టీకి కొత్త నాయకుడిని ఎన్నుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఆ ప్రక్రియలో యాండీ బర్న్‌హామ్ విజయం సాధించి పార్టీ అధ్యక్ష బాధ్యతలను దక్కించుకున్నారు.
నాయకుడిగా ఎన్నికైన అనంతరం స్పందించిన బర్న్‌హామ్, "కీర్ స్టార్మర్ వేసిన బలమైన పునాదులపై మరింత అభివృద్ధి సాధించేలా ముందుకు సాగుతాను. దేశ అభివృద్ధికి కొత్త దిశగా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నానని తెలిపారు.