Loading...
Morocco: ఆహారం లేదు.. నీళ్లు లేవు.. స్పెయిన్‌ నుంచి తిరుగు బాట పట్టిన వేలాది వలసదారులు
ఆహారం లేదు.. నీళ్లు లేవు.. స్పెయిన్‌ నుంచి తిరుగు బాట పట్టిన వేలాది వలసదారులు

Morocco: ఆహారం లేదు.. నీళ్లు లేవు.. స్పెయిన్‌ నుంచి తిరుగు బాట పట్టిన వేలాది వలసదారులు

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 02, 2026
12:56 pm

ఈ వార్తాకథనం ఏంటి

మొరాకో నుంచి స్పెయిన్‌లోకి అక్రమంగా ప్రవేశించిన వేలాది మంది వలసదారులు గంటల వ్యవధిలోనే తిరిగి స్వదేశానికి వెళ్లిపోయారు. గురువారం స్పెయిన్‌ భూభాగంలోకి చేరుకున్న సుమారు 60 వేల మంది వలసదారుల్లో దాదాపు 45 వేల మందికిపైగా శుక్రవారం మొరాకోకు తిరిగి వెళ్లినట్లు అంచనా. మొరాకో నుంచి సముద్ర మార్గం ద్వారా స్పెయిన్‌ ఆధీనంలోని సెయూటా నగరానికి గురువారం ఒక్కసారిగా వేలాది మంది వలసదారులు చేరుకున్నారు. కొందరు చిన్న పడవల్లో, మరికొందరు సముద్రంలో ఈదుకుంటూ స్పెయిన్‌ భూభాగంలోకి ప్రవేశించారు. ఒక్కరోజే సుమారు 60 వేల మందికిపైగా అక్రమంగా సరిహద్దు దాటినట్లు భావిస్తున్నారు.

వివరాలు

57 మంది మొరాకో వాసులు మృతి

సముద్ర తీరం, సరిహద్దు ప్రాంతాలు, పర్వత మార్గాల గుండా వేలాది మంది ఒకేసారి రావడం ప్రపంచవ్యాప్తంగా సంచలనంగా మారింది.

ఈ ప్రయాణంలో సముద్రంలో ఈదుకుంటూ వస్తుండగా 57 మంది మొరాకో వాసులు మృతి చెందినట్లు అంచనా వేస్తున్నారు.

అక్రమ వలసలను అడ్డుకునేందుకు స్పెయిన్‌ భద్రతా బలగాలు సరిహద్దులో భారీగా మోహరించాయి.

వలసదారులను అడ్డుకునేందుకు వాటర్‌ కెనాన్లు, టియర్‌ గ్యాస్‌తో పాటు కాల్పులు కూడా జరిపినట్లు సమాచారం. ఈ ఘటనల్లో పలువురు గాయపడగా, తొక్కిసలాటలో కొందరు మరణించినట్లు తెలుస్తోంది

వివరాలు

వేలాది మంది వలసదారులు తిరిగి మొరాకోకు

భద్రతా బలగాల కట్టుదిట్టమైన చర్యలతో వేలాది మంది వలసదారులు తిరిగి మొరాకోకు వెళ్లిపోయారు.

ఈ క్రమంలో పలువురు సముద్రంలో మునిగి ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. సెయూటా నగర ప్రవేశ ద్వారం వద్దే చాలా మందిని భద్రతా సిబ్బంది నిలువరించారు.

పరిస్థితిని అదుపులో ఉంచేందుకు స్పెయిన్‌ ప్రభుత్వం సరిహద్దులో భారీ సంఖ్యలో సైనిక వాహనాలను మోహరించి, మొత్తం ప్రాంతాన్ని నిరంతరం పర్యవేక్షిస్తోంది.

అయితే భద్రతా బలగాలను తప్పించుకుని కొందరు వలసదారులు స్పెయిన్‌లోకి ప్రవేశించినప్పటికీ, వారికి అక్కడ ఆశ్రయం, ఆహారం, తాగునీరు కూడా లభించలేదు.

ADVERTISEMENT