Nobel Prize 2023: భౌతికశాస్త్రంలో ముగ్గురిని వరించిన నోబెల్ బహుమతి
ఈ వార్తాకథనం ఏంటి
ప్రతి ఏడాది ప్రపంచంలోని ప్రధాన రంగాల్లో అత్యుత్తమ సేవలు కనబరిచినందుకుగాను నోబెల్ బహుమతిని రాయల్ స్వీడిష్ అకాడమీ అందజేస్తున్న సంగతి తెలిసిందే.
ఈ ఏడాది నోబెల్ అవార్డుల ప్రకటన సోమవారం మొదలైంది. తాజాగా ఈరోజు ఉదయం భౌతిక శాస్త్ర విభాగంలో ముగ్గురు శాస్త్రవేత్తలకు అవార్డును ప్రకటించారు.
అణువుల్లో ఎలక్ట్రాన్స్ డైనమిక్స్ ని అధ్యాయం చేసినందుకు గాను ఈ అవార్డు లభించింది.
అమెరికాకు చెందిన పెర్రి అగోస్తిని, స్వీడన్ కు చెందిన అన్నే ఎల్ హ్యులియర్, ఫెరెన్స్ క్రౌజ్ (జర్మనీ) అను ముగ్గురు శాస్త్రవేత్తలకు భౌతిక శాస్త్రంలో 2023సంవత్సరానికి గాను నోబెల్ బహుమతి లభించింది.
Details
సోమవారం వైద్య విభాగంలో నోబెల్ అందుకున్న శాస్త్రవేత్తలు
ఎలక్ట్రాన్ల పై వీరు చేసిన ప్రయోగం ద్వారా విశ్వాన్ని అర్థం చేసుకునే వీలు కలుగుతుందని రాయల్ స్వీడిష్ అకాడమీ తెలియజేసింది.
నోబెల్ బహుమతుల ప్రకటన సోమవారం మొదలైందని ముందే చెప్పుకున్నాం. సోమవారం రోజున వైద్యశాస్త్రంలో ఇద్దరు శాస్త్రవేత్తలకు నోబెల్ బహుమతిని ప్రకటించారు.
కరోనా మహమ్మారిని అంతం చేసే ఎమ్ ఎన్ ఆర్ ఏ వ్యాక్సిన్ అభివృద్ధి చేసినందుకుగాను కాటలిన్ కరికో, డ్రూ వెయిస్మన్ లకు అవార్డు లభించింది.
నోబెల్ బహుమతుల ప్రకటనలు అక్టోబర్ 9వ తేదీ వరకు జరుగుతాయి. అక్టోబర్ 4 బుధవారం రోజున రసాయన శాస్త్రం, గురువారం సాహిత్యం, శుక్రవారం శాంతి బహుమతి, 9వ తేదీన అర్థశాస్త్రంలో నోబెల్ బహుమతి గ్రహీతల పేర్లను వెల్లడిస్తారు.