
పుతిన్ కోసం రష్యా వెళ్లిన కిమ్.. అమెరికా హెచ్చరికల్ని పట్టించుకోని ఉత్తరకొరియా
ఈ వార్తాకథనం ఏంటి
ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ (Kim Jong Un) మరో సంచలనానికి తెరలేపారు.
ఈ మేరకు తన ప్రైవేట్ రైళ్లో రష్యాకు బయల్దేరారు. రష్యన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో భేటీ కోసం రైలు మార్గాన రష్యాలోకి ప్రవేశించినట్లు రష్యా అధికార మీడియా సంస్థ రియా నొవొస్తీ పేర్కొంది.
ఉత్తరకొరియా నుంచి రష్యాలోని ప్రిమోర్స్కీలోకి రైలు ప్రవేశించినట్లు వివరించింది.
రష్యా-ఉత్తరకొరియా మధ్య ఆయుధాలకు సంబంధించి ఒప్పందం కుదిరే అవకాశం ఉందని తెలుస్తోంది.
DETAILS
నాలుగేళ్ల తర్వాత కిమ్‌కు ఇదే మొట్టమొదటి విదేశీ ప్రయాణం
ఆర్టిలరీ షెల్స్, యాంటీట్యాంక్ మిసైల్స్ అందించాలని రష్యా కోరనున్నట్లు సమాచారం. బదులుగా న్యూక్లియర్ సామర్థ్యమున్న సబ్‌మెరైన్ సాంకేతికతను కొరియాకు అందించనున్నారు.
మరోవైపు కిమ్ రష్యా పర్యటనను దక్షిణకొరియా ధృవీకరించింది.
నాలుగేళ్ల తర్వాత కిమ్‌కు ఇదే మొట్టమొదటి విదేశీ ప్రయాణం. కిమ్- పుతిన్ సున్నితమైన, కీలకమైన అంశాలపై చర్చించనున్నట్లు రష్యన్ అధికార ప్రతినిధి దిమ్మిత్రి పెస్కోవ్ తెలిపారు.
ఉక్రెయిన్ యుద్ధానికి సంబంధించి ఆయుధాల సరఫరాలో రష్యాకు సహకరించొద్దని, లేదంటే భారీ మూల్యం చెల్లించుకుంటారని కిమ్ ను అమెరికా హెచ్చరించింది. అయినా కిమ్ రష్యా వెళ్లడం కొసమెరుపు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
పుతిన్ కోసం రష్యా వెళ్లిన కిమ్
🇰🇵🇷🇺 Kim Jong-un's armored train is in #Russia#KimJongUn #Putin #NorthKorea
— Shen Shiwei 沈诗伟 (@shen_shiwei) September 12, 2023
pic.twitter.com/p59CMlWdo1