Loading...
Nvidia Chips to China: చైనాకు ఎన్విడియా చిప్‌ల సరఫరా బంద్.. కీలక నిర్ణయం వెనుక కారణమిదే!
చైనాకు ఎన్విడియా చిప్‌ల సరఫరా బంద్.. కీలక నిర్ణయం వెనుక కారణమిదే!

Nvidia Chips to China: చైనాకు ఎన్విడియా చిప్‌ల సరఫరా బంద్.. కీలక నిర్ణయం వెనుక కారణమిదే!

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 18, 2026
05:42 pm

ఈ వార్తాకథనం ఏంటి

జెన్సెన్‌ హువాంగ్‌ రాజీనామా, తదనంతర పరిణామాల నేపథ్యంలో ఏఐ దిగ్గజ సంస్థ ఎన్విడియా కీలక నిర్ణయం తీసుకుంది. హాపర్ సిరీస్‌కు చెందిన కృత్రిమ మేధ ఆధారిత చిప్‌లను చైనాకు సరఫరా చేయడాన్ని నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. శక్తిమంతమైన సెమీకండక్టర్లను చైనాకు ఎగుమతి చేసే అంశాన్ని అమెరికా సున్నితమైన విషయంగా పరిగణిస్తున్న వేళ ఈ నిర్ణయం తీసుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది. మరోవైపు, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనాలో పర్యటిస్తున్న సమయంలోనే ఈ ప్రకటన వెలువడటం గమనార్హం.

వివరాలు

చైనాకు భారీగా చిప్‌లు విక్రయించిన ఎన్విడియా

కృత్రిమ మేధ సాధనాల అభివృద్ధిలో అమెరికా, చైనాల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. అయినప్పటికీ అత్యాధునిక చిప్‌ల ఎగుమతికి ట్రంప్ ప్రభుత్వం గతేడాది ఆమోదం తెలిపింది.

ఈ క్రమంలో ఏఐ టూల్స్‌కు అవసరమైన అత్యాధునిక హార్డ్‌వేర్ చిప్‌లను అభివృద్ధి చేస్తున్న ఎన్విడియా.. భారీ స్థాయిలో వాటిని చైనాకు ఎగుమతి చేస్తోంది.

గత త్రైమాసికంలోనే 2.4 బిలియన్ డాలర్ల విలువైన డేటా సెంటర్ హాపర్ జనరేషన్ ఉత్పత్తులను విక్రయించింది.

అయితే తాజా పరిణామాల నేపథ్యంలో అప్రమత్తమైన సంస్థ.. ఇకపై చైనాకు ఎలాంటి విక్రయాలు చేయబోమని స్పష్టం చేసింది. ఈ విషయాన్ని ఎన్విడియా తాత్కాలిక సీఈవో కొలెట్ క్రెస్ వెల్లడించారు.

వివరాలు

డిసెంబర్ 1న ప్రతినిధుల సభ ముందు జెన్సన్ హాజరు

మరోవైపు చైనా గూఢచారిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న మహిళతో అనైతిక సంబంధం కొనసాగించినట్లు అంగీకరించిన జెన్సన్ హువాంగ్ ఇటీవల ఎన్విడియా నుంచి వైదొలిగిన విషయం తెలిసిందే.

ఆయన తీసుకున్న నిర్ణయాల వల్ల అమెరికా ప్రయోజనాలకు ఏమైనా భంగం వాటిల్లిందా అనే అంశంపై విచారణ చేపట్టేందుకు ప్రతినిధుల సభ సిద్ధమైంది.

ఈ నేపథ్యంలో డిసెంబర్ 1న ప్రతినిధుల సభ కమిటీల ముందు జెన్సన్ హాజరై వివరణ ఇవ్వనున్నారు.

ADVERTISEMENT