LOADING...
Macron: మోదీతో మా బంధం చిరకాలం ఉండాలి : మేక్రాన్ పోస్టు
మోదీతో మా బంధం చిరకాలం ఉండాలి : మేక్రాన్ పోస్టు

Macron: మోదీతో మా బంధం చిరకాలం ఉండాలి : మేక్రాన్ పోస్టు

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 23, 2025
10:16 am

ఈ వార్తాకథనం ఏంటి

భారతదేశంతో ఉన్న స్నేహబంధం చిరకాలం కొనసాగాలని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయేల్ మేక్రాన్ అభిప్రాయపడ్డారు. దక్షిణాఫ్రికా జొహన్నెస్‌బర్గ్‌లో జరిగిన జీ-20 సదస్సు సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో జరిగిన భేటీ అనంతరం ఈ బంధాన్ని సోషల్ మీడియాలో ప్రస్తావించారు. "భారత ప్రధాని, నా ప్రియ స్నేహితుడు నరేంద్ర మోదీకి ప్రత్యేక ధన్యవాదాలు. ప్రపంచ దేశాలు పరస్పరం సహకరిస్తూ కలిసి ముందుకు సాగితేనే అవి మరింత బలంగా మారతాయి. ఇదే విధంగా ఫ్రాన్స్-భారత్ మధ్య స్నేహం ఎల్లప్పుడూ నిలవాలని మేక్రాన్ పేర్కొన్నారు. ఈ సందేశంతో పాటు మోదీతో తన ఫొటోను కూడా షేర్ చేశారు. అంతకుముందు జరిగిన జీ-20 శిఖరాగ్ర సదస్సులో మేక్రాన్ కీలక వ్యాఖ్యలు చేశారు.

Details

ముఖ్యమైన సమస్యలను పరిష్కరించుకోవాలి

ప్రపంచవ్యాప్తంగా ఏర్పడుతున్న ప్రధాన సంక్షోభాలను ఎదుర్కోవడంలో జీ-20 కూటమి తీవ్ర సవాళ్లను ఎదుర్కొంటోందని, ఈ పరిస్థితుల్లో కూటమి ఉనికే ప్రమాదంలో పడే అవకాశం ఉందని హెచ్చరించారు. ముఖ్యమైన సమస్యలను పరిష్కరించేందుకు అన్ని దేశాలు కలిసికట్టుగా పని చేయాల్సిన అవసరం ఉందని, ప్రాధాన్యతలపై ఏకాభిప్రాయం లేకుంటే జీ-20 భవిష్యత్తు ప్రశ్నార్థకమవుతుందని ఆయన స్పష్టం చేశారు. ఇక శనివారం జరిగిన జీ-20 శిఖరాగ్ర సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు అనేక ప్రపంచ దేశాధినేతలు పాల్గొన్నారు.

Details

ప్రత్యేకమైన వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలి

ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరెస్, బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్, ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్, కెనడా ప్రధాని మార్క్ కార్నే, అలాగే ఫ్రాన్స్, కొరియా, బ్రెజిల్ నాయకులను కూడా మోదీ కలుసుకున్నారు ఈ సదస్సులో ఉగ్రవాదం, మాదకద్రవ్యాల మద్య ఉన్న సంబంధాలను పూర్తిగా నిర్మూలించాల్సిన అవసరాన్ని మోదీ ముందుకొచ్చారు. దీనికోసం కూటమి దేశాలు ప్రత్యేకమైన ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలని ఆయన ప్రతిపాదించారు.