Loading...
Bangladesh: బంగ్లాదేశ్ జైళ్లలో సగానికి పైగా భారతీయులే..శిక్ష పూర్తయినా విడుదలలో జాప్యం!
బంగ్లాదేశ్ జైళ్లలో సగానికి పైగా భారతీయులే..శిక్ష పూర్తయినా విడుదలలో జాప్యం!

Bangladesh: బంగ్లాదేశ్ జైళ్లలో సగానికి పైగా భారతీయులే..శిక్ష పూర్తయినా విడుదలలో జాప్యం!

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 23, 2026
04:10 pm

ఈ వార్తాకథనం ఏంటి

బంగ్లాదేశ్‌లోని వివిధ జైళ్లలో డ్రగ్స్ అక్రమ రవాణా,మానవ అక్రమ రవాణా,బంగారం స్మగ్లింగ్ వంటి తీవ్రమైన నేరాలకు సంబంధించిన కేసుల్లో పలువురు విదేశీయులు శిక్ష అనుభవిస్తున్నారు. మొత్తం 407 మంది విదేశీ ఖైదీలు అక్కడి జైళ్లలో ఉండగా,వారిలో సగానికి పైగా భారతీయులే కావడం గమనార్హం. శిక్షాకాలం పూర్తయిన తర్వాత కూడా గణనీయమైన సంఖ్యలో భారతీయులు జైళ్ల నుంచి విడుదల కాకపోవడం ఆందోళన కలిగిస్తోంది. బంగ్లాదేశ్‌కు చెందిన ప్రముఖ ఆంగ్ల దినపత్రిక 'ది డైలీ స్టార్'కథనం ప్రకారం..ఆ దేశంలోని వివిధ జైళ్లలో మొత్తం 238మంది భారతీయులు ఖైదీలుగా ఉన్నారు. వీరిలో 168 మంది ఇప్పటికే తమ శిక్షాకాలాన్ని పూర్తి చేసుకున్నారు. అయినప్పటికీ, వారిని స్వదేశానికి పంపించే ప్రక్రియలో జాప్యం జరుగుతుండటంతో ఇంకా జైళ్లలోనే ఉండాల్సి వస్తోంది.

వివరాలు 

స్వదేశానికి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్న భారతీయులు కేవలం 25 మంది

అయితే, ఈ గణాంకాలపై ఢాకాలోని భారత హైకమిషన్ భిన్నమైన వివరాలను వెల్లడించింది.

శిక్ష పూర్తిచేసుకుని, స్వదేశానికి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నట్లు ధ్రువీకరించిన భారతీయులు కేవలం 25 మంది మాత్రమేనని హైకమిషన్‌లోని కాన్సులర్ విభాగం అధికారి ఒకరు తెలిపారు.

బంగ్లాదేశ్ విదేశాంగ శాఖ మొత్తం 121 మంది ఖైదీలకు సంబంధించిన జాబితాను పంపినట్లు పేర్కొన్నారు.

అయితే, ఆ జాబితాలో పలువురి వ్యక్తిగత వివరాలు పూర్తిస్థాయిలో లేకపోవడంతో వారి జాతీయతను నిర్ధారించడం కష్టంగా మారిందని వివరించారు.

ఈ నేపథ్యంలో సంబంధిత ఖైదీలను కలిసేందుకు అనుమతి కోరామని, బంగ్లాదేశ్ విదేశాంగ శాఖ నుంచి స్పందన కోసం ఎదురుచూస్తున్నామని తెలిపారు.

వివరాలు 

భారతీయుల తర్వాత బంగ్లాదేశ్ జైళ్లలో.. మయన్మార్‌కు చెందిన ఖైదీలు

భారతీయుల తర్వాత బంగ్లాదేశ్ జైళ్లలో అత్యధికంగా మయన్మార్‌కు చెందిన ఖైదీలు ఉన్నారు.

ఆ దేశానికి చెందిన 133 మంది ప్రస్తుతం జైళ్లలో ఉన్నట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి.

వీరితో పాటు నైజీరియాకు చెందిన ఆరుగురు, పాకిస్థాన్‌, మలేషియా దేశాలకు చెందిన ముగ్గురు చొప్పున ఖైదీలు ఉన్నారు.

భద్రతాపరమైన కారణాలతో విదేశీ ఖైదీలను ప్రత్యేక సెల్‌లలో ఉంచుతున్నారు. వారి కదలికలను సీసీటీవీ కెమెరాల ద్వారా నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.

మరోవైపు, శిక్షాకాలం పూర్తయిన ఖైదీలు సైతం విడుదల కాకుండా జైళ్లలోనే కొనసాగుతుండటంతో నిర్వహణాపరమైన సమస్యలు ఎదురవుతున్నాయని అధికారులు చెబుతున్నారు.

ఖైదీలను ఎక్కువకాలం నిర్బంధంలో ఉంచాల్సి రావడం వల్ల జైళ్ల నిర్వహణ ఖర్చులు పెరుగుతున్నాయని, ఇది ప్రభుత్వంపై అదనపు ఆర్థిక భారాన్ని మోపుతోందని పేర్కొంటున్నారు.

ADVERTISEMENT