LOADING...
Mushahid Hussain: యూఏఈకి పాక్ మంత్రి హెచ్చరిక.. అఖండ భారత్‌లో చేరొద్దని సూచన
Mushahid Hussain: యూఏఈకి పాక్ మంత్రి హెచ్చరిక..అఖండ భారత్‌లో చేరొద్దని సూచన

Mushahid Hussain: యూఏఈకి పాక్ మంత్రి హెచ్చరిక.. అఖండ భారత్‌లో చేరొద్దని సూచన

వ్రాసిన వారు Sirish Praharaju
Apr 07, 2026
12:19 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారతదేశంపై పాకిస్థాన్ మంత్రి ముషాహిద్ హుస్సేన్ తీవ్ర విమర్శలు చేశారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో భారతీయుల సంఖ్య ఎక్కువగా ఉండటంతో ఆ దేశం అప్రమత్తంగా ఉండాలని, అఖండ భారత్‌లో భాగం కావద్దని ఆయన వ్యాఖ్యానించారు. అదే సమయంలో యూఏఈ అభివృద్ధిలో పాకిస్థాన్ కీలక పాత్ర పోషించిందని కూడా చెప్పారు. ఒక టీవీ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన యూఏఈను బలహీన దేశంగా అభివర్ణిస్తూ విమర్శలు చేశారు. గతంలో పాకిస్థాన్‌కు యూఏఈ ఆర్థికంగా చాలా కాలం పాటు సహకారం అందించిందని గుర్తుచేశారు. ఈ నేపథ్యంలో, యూఏఈ నుంచి తీసుకున్న రుణాలను తిరిగి చెల్లించేందుకు పాకిస్థాన్ సిద్ధమవుతోందని తెలిపారు.

వివరాలు 

యూఏఈలో 4.3 మిలియన్లు భారతీయులే..

ప్రస్తుతం యూఏఈ ఆర్థిక అవసరాల్లో ఉందని పేర్కొంటూ,అవసరం అయితే పెద్దన్నగా పాకిస్థాన్ సహాయం చేయగలదని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. గల్ఫ్ ప్రాంతంలో యూఏఈ అభివృద్ధిలో పాకిస్థాన్ సహకారం ఎంతో ఉందని, ఆ దేశ నిర్మాణంలో తమ భాగస్వామ్యం ఉన్నదని ఆయన చెప్పారు. యూఏఈతో పాకిస్థాన్ ఎప్పుడూ మైత్రి సంబంధాలు కొనసాగించిందని కూడా అన్నారు. ఇక మరోవైపు, భారత్-యూఏఈ సంబంధాలు రోజురోజుకూ బలపడుతున్న నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. యూఏఈలో సుమారు 10 మిలియన్ జనాభాలో 4.3 మిలియన్లు భారతీయులే ఉన్నారని పేర్కొంటూ, ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని జాగ్రత్తగా ఉండాలని సూచించారు. భారతదేశంతో సంబంధాలు పెరుగుతున్న నేపథ్యంలో, అఖండ భారత్ భావనలో భాగం కాకుండా యూఏఈ అప్రమత్తంగా ఉండాలని ఆయన వ్యాఖ్యానించారు.

Advertisement