Loading...
Pakistan: పాకిస్థాన్‌లో 200 ఏళ్ల పురాతన హిందూ ఆలయానికి తాళం.. ఎందుకంటే?
పాకిస్థాన్‌లో 200 ఏళ్ల పురాతన హిందూ ఆలయానికి తాళం.. ఎందుకంటే?

Pakistan: పాకిస్థాన్‌లో 200 ఏళ్ల పురాతన హిందూ ఆలయానికి తాళం.. ఎందుకంటే?

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 19, 2026
09:48 am

ఈ వార్తాకథనం ఏంటి

పాకిస్థాన్‌లోని ఖైబర్ పఖ్తున్‌ఖ్వా ప్రావిన్స్‌లో ఉన్న సుమారు 200 ఏళ్ల పురాతన రామ్‌లీలా హిందూ ఆలయానికి అధికారులు తాళం వేశారు. డేరా ఇస్మాయిల్ ఖాన్ నగరంలోని ఈ చారిత్రక ఆలయాన్ని కూల్చివేసి, ఆ స్థలంలో వాణిజ్య సముదాయం నిర్మించేందుకు ప్రయత్నాలు జరగడం వివాదానికి దారితీసింది. స్థానిక హిందువులు,పౌర హక్కుల కార్యకర్తలు,వ్యాపారులు ఈ చర్యలను వ్యతిరేకిస్తూ నిరసన వ్యక్తం చేశారు. దీంతో అధికారులు ఆలయాన్ని తమ ఆధీనంలోకి తీసుకుని సీల్ చేశారు. డేరా ఇస్మాయిల్ ఖాన్‌లోని రహీమ్ బజార్ ప్రాంతంలో ఈ ఆలయం ఉంది. ఆలయాన్ని కూల్చివేసే పనులు జరుగుతున్నాయనే సమాచారం అందడంతో డేరా సివిల్ సొసైటీ అధ్యక్షుడు సోహైల్ అహ్మద్ అజ్మీతో పాటు పలువురు స్థానికులు అక్కడికి చేరుకున్నారు.

వివరాలు 

హిందూ సంఘాల ప్రతినిధులు, పౌర సమాజ కార్యకర్తల సమావేశం 

నిర్మాణ పనులను అడ్డుకుని నిరసన తెలిపారు. ఆలయాన్ని తొలగించి ఆ స్థలంలో కమర్షియల్ ప్లాజా నిర్మించేందుకు కాంట్రాక్టు ఇచ్చినట్లు ఓ వ్యక్తి చెప్పాడని అజ్మీ వెల్లడించారు.

ఈ ఘటనపై హిందూ సంఘాల ప్రతినిధులు, పౌర సమాజ కార్యకర్తలు సమావేశమయ్యారు.

చారిత్రక ఆలయాన్ని కాపాడేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ఆలయ స్థలంపై అసలు యాజమాన్య హక్కులు ఎవరికి ఉన్నాయి? అక్కడ వాణిజ్య భవనాలు నిర్మించేందుకు అవసరమైన అనుమతులు ఉన్నాయా? అనే అంశాలపై సమగ్ర విచారణ జరపాలని కోరారు.

ఈ వివాదాన్ని పాకిస్థాన్ జాతీయ అసెంబ్లీలోనూ ప్రస్తావించాలని ప్రజాప్రతినిధులకు విజ్ఞప్తి చేశారు.

వివరాలు 

ఈ జాబితాలో రామ్‌లీలా ఆలయం

డేరా ఇస్మాయిల్ ఖాన్ ప్రాంతంలో సుమారు 400 భవనాలను సాంస్కృతిక వారసత్వ కట్టడాలుగా అధికారులు గుర్తించారు.

ఈ జాబితాలో రామ్‌లీలా ఆలయం కూడా ఉంది. ఇలాంటి చారిత్రక కట్టడాలను కూల్చివేసే ప్రయత్నాలు జరగకుండా తగిన రక్షణ కల్పించాలని స్థానికులు కోరుతున్నారు.

పాకిస్థాన్‌లో హిందూ, సిక్కు మతాలకు చెందిన ప్రార్థనా స్థలాల పరిరక్షణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని ఆల్ పాకిస్థాన్ హిందూ రైట్స్ మూవ్‌మెంట్ అధ్యక్షుడు హరూన్ సరబ్ డయల్ డిమాండ్ చేశారు.

మతపరమైన ఆస్తులను అక్రమంగా ఆక్రమించుకోవడం, వాటిని విక్రయించడం వంటి ఆరోపణలపై కూడా విచారణ జరపాలని ఆయన కోరారు.

ADVERTISEMENT

వివరాలు 

ఆలయాన్ని కూల్చివేసే ప్రయత్నాలపై నిరసనలు

మరోవైపు, పాకిస్థాన్‌లో మైనారిటీల హక్కులు, వారి మతపరమైన వారసత్వ కట్టడాల భద్రతపై ఆందోళనలు కొనసాగుతున్నాయి.

మైనారిటీలకు చెందిన ఆస్తుల నిర్వహణలో పారదర్శకతను పెంచడంతో పాటు, సంబంధిత అధికారుల జవాబుదారీతనాన్ని నిర్ధారించాలని పాకిస్థాన్ మానవ హక్కుల కమిషన్ సూచించింది.

ఈ పరిణామాల నేపథ్యంలో రామ్‌లీలా ఆలయ వివాదం ప్రాధాన్యం సంతరించుకుంది.

దాదాపు రెండు శతాబ్దాల చరిత్ర కలిగిన ఈ ఆలయాన్ని కూల్చివేసే ప్రయత్నాలపై నిరసనలు వ్యక్తమవుతున్న వేళ, అధికారులు దానికి సీల్ వేశారు.

ఆలయ స్థల యాజమాన్యం, నిర్మాణ అనుమతులపై ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు? చారిత్రక కట్టడాన్ని పరిరక్షించేందుకు తదుపరి ఏ చర్యలు చేపడతారు? అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

ADVERTISEMENT