Trump: భారత్ ఒత్తిడికి భయపడ్డ పాక్.. సీజ్‌ఫైర్‌పై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు!
ఈ వార్తాకథనం ఏంటి
భారతదేశం-పాకిస్థాన్ మధ్య జరిగిన కాల్పుల విరమణ (సీజ్‌ఫైర్) వెనుక అంతర్జాతీయ స్థాయిలో ఏం జరిగిందనే అంశంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇతర దేశాల అభ్యర్థన మేరకే తాము ఈ కాల్పుల విరమణ ప్రక్రియలో జోక్యం చేసుకున్నామని ఆయన స్పష్టం చేశారు. అయితే ఈ నిర్ణయాన్ని తాను అంతగా ఇష్టపడలేదని, కానీ పాకిస్థాన్ సైన్యాధిపతి అసిమ్ మునీర్, ఆ దేశ ప్రధాని షెహబాజ్ షరీఫ్ పదేపదే విజ్ఞప్తి చేయడంతో తాము జోక్యం చేసుకున్నామని ట్రంప్ పేర్కొన్నారు. వారికో "ఫేవర్" చేసినట్టుగా సీజ్‌ఫైర్‌పై చర్చలు జరిపినట్లు తెలిపారు.
వివరాలు
అమెరికాను అశ్రయించిన పాక్
ఇటీవల అమెరికాలోని యాంకరేజ్ నగరానికి ప్రయాణిస్తున్న సమయంలో విమానంలో మీడియాతో మాట్లాడిన ట్రంప్, పాక్ ప్రధాని, ఆర్మీ చీఫ్‌ను "టెర్రిఫిక్ పీపుల్" అంటూ ప్రశంసించడం అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారింది. భారత్ దెబ్బకు భయపడి పాకిస్థాన్ అమెరికాను ఆశ్రయించిందనే భావనకు ఈ వ్యాఖ్యలు మరింత బలం చేకూర్చాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇక ఈ కాల్పుల విరమణపై పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ గతంలో మరో ప్రకటన చేశారు. భారత్ స్వయంగా అమెరికాను ఆశ్రయించి, మధ్యవర్తిత్వం వహించాలని కోరిందని ఆయన వ్యాఖ్యానించారు. రావల్పిండిలోని పాక్ ఆర్మీ ప్రధాన కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో మాట్లాడిన మునీర్, ప్రాంతీయ శాంతి కోసం భారత్ అమెరికా నాయకత్వం ద్వారా మధ్యవర్తిత్వానికి ఆసక్తి చూపించిందన్నారు.
వివరాలు
పాక్ ఆర్మీ చీఫ్ వ్యాఖ్యలు అసత్యం
, దానికి పాకిస్థాన్ అంగీకరించిందని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలను డాన్ న్యూస్ ప్రచురించింది. అయితే ఈ వ్యవహారానికి సంబంధించిన అసలు వివరాలు అమెరికాలోని విదేశీ ఏజెంట్ల నమోదు Act ద్వారా బయటపడ్డాయి. భారత్ మధ్యవర్తిత్వం కోరిందన్న పాక్ ఆర్మీ చీఫ్ వ్యాఖ్యలు అసత్యమని అమెరికా అధికారిక లాబీయింగ్ పత్రాలు సూచిస్తున్నాయి. మే 6 నుంచి మే 9, 2025 మధ్య కాలంలో పాకిస్థానే స్వయంగా అమెరికాలో పెద్ద ఎత్తున దౌత్యపరమైన లాబీయింగ్ నిర్వహించినట్లు ఈ రికార్డులు వెల్లడించాయి. అమెరికా ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ సహాయకులు, రక్షణ శాఖ అధికారులు, ట్రెజరీ అధికారులు, జాతీయ భద్రతా సలహాదారులు, జర్నలిస్టులతో పాకిస్థాన్ దాదాపు 60 సార్లు సంప్రదింపులు జరిపినట్లు ఆసియన్ న్యూస్ ఇంటర్నేషనల్ సమీక్షించిన పత్రాల్లో వెల్లడైంది.