Pakistan: మూడు దళాలు ఒకే గొడుగు కిందకు.. పాక్‌లో కొత్త సైనిక వ్యవస్థ
ఈ వార్తాకథనం ఏంటి
పాకిస్థాన్ ప్రభుత్వం సైనిక వ్యవస్థలో కీలక మార్పులకు శ్రీకారం చుట్టింది. సైనిక వ్యవస్థను పూర్తిగా పునర్వ్యవస్థీకరించే లక్ష్యంతో 'డిఫెన్స్ ఫోర్స్ ఆఫ్ పాకిస్థాన్ యాక్ట్ 2026'కు ఆమోదం తెలిపింది. అలాగే 'నేషనల్ కమాండ్ అథారిటీ యాక్ట్ 2010'లోనూ పలు కీలక సవరణలు చేసింది. తాజా మార్పులతో పాకిస్థాన్ ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్‌ను ఒకే సమన్వయ వ్యవస్థ కిందకు తీసుకొచ్చారు. ఈ కొత్త వ్యవస్థకు చీఫ్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్సెస్ (CDF) జనరల్ అసిమ్ మునీర్ నాయకత్వం వహించనున్నారు. కొత్త చట్టం ప్రకారం CDFకు మూడు సాయుధ దళాలకు సంబంధించిన ఆపరేషనల్ కమాండ్, కంట్రోల్,సమన్వయం,మల్టీ-డొమైన్ ఇంటిగ్రేషన్,వ్యూహాత్మక అంశాల పర్యవేక్షణ వంటి విస్తృత అధికారాలు,బాధ్యతలు అప్పగించారు. సైనిక సిబ్బంది విషయంలోనూ మునీర్‌కు గణనీయమైన అధికారాలు కల్పించారు.
వివరాలు
పదవీ విరమణ వయస్సు లేదా సర్వీసు పరిమితిని సడలించే అధికారం
చట్టంలోని నిబంధనల ప్రకారం సైనిక సిబ్బందిని రిటైర్ చేయడం, సర్వీసు నుంచి విడుదల చేయడం, తొలగించడం, రాజీనామాను ఆమోదించడం లేదా తిరస్కరించడం, సర్వీసులో కొనసాగించడం వంటి నిర్ణయాలను CDF తీసుకోవచ్చు.
అవసరమైన పరిస్థితుల్లో నిర్దేశిత పదవీ విరమణ వయస్సు లేదా సర్వీసు పరిమితిని సడలించే అధికారం కూడా ఆయనకు ఉంటుంది.
అయితే ఈ అధికారాలకు చట్టంలో పేర్కొన్న కొన్ని మినహాయింపులు వర్తిస్తాయి.
వివరాలు
ప్రధానికి ప్రధాన సైనిక సలహాదారుగా CDF
డిఫెన్స్ ఫోర్సెస్ హెడ్‌క్వార్టర్స్ నేరుగా CDF ఆధ్వర్యంలో పనిచేయనుంది.
జాతీయ భద్రత, రక్షణ, సాయుధ దళాలకు సంబంధించిన అంశాల్లో జనరల్ అసిమ్ మునీర్ పాకిస్థాన్ ప్రధానమంత్రికి 'ప్రిన్సిపల్ మిలిటరీ అడ్వైజర్'గా వ్యవహరించనున్నారు.
కమాండ్, కంట్రోల్‌కు సంబంధించిన వ్యవహారాల్లో CDF ఫెడరల్ ప్రభుత్వానికి బాధ్యత వహిస్తారు.
అంతేకాకుండా చట్టంలో ఇప్పటికే పేర్కొన్న అధికారాలు, బాధ్యతలకు అదనంగా మరిన్ని బాధ్యతలను, అధికారాలను కూడా CDFకు అప్పగించే అవకాశం ప్రభుత్వానికి ఉంటుంది.
వివరాలు
ప్రధానికి ప్రధాన సైనిక సలహాదారుగా CDF
కొత్త వ్యవస్థ అమలులో ఇబ్బందులు ఎదురైనా, నిబంధనల మధ్య విభేదాలు తలెత్తినా వాటిని పరిష్కరించేందుకు పాకిస్థాన్ అధ్యక్షుడికి ఆదేశాలు జారీ చేసే అధికారం కూడా కల్పించారు.
ఇదిలా ఉండగా.. గత ఏడాది జరిగిన 27వ రాజ్యాంగ సవరణలో భాగంగా 'కమాండర్ ఆఫ్ ది నేషనల్ స్ట్రాటజిక్ కమాండ్' (CNSC) అనే కొత్త హోదాను ఏర్పాటు చేశారు.
పాకిస్థాన్ వ్యూహాత్మక దళాల ఆపరేషనల్ సమన్వయ బాధ్యతలను ఈ అధికారి నిర్వహిస్తారు.
గత నెలలో లెఫ్టినెంట్ జనరల్ స్థాయి నుంచి పదోన్నతి పొందిన జనరల్ సయ్యద్ ఆమిర్ రజాను తొలి CNSCగా నియమించారు.