
పాకిస్థాన్: ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఇంటిపై పెట్రోల్ బాంబులు విసిరిన ఇమ్రాన్ మద్దతుదారులు
ఈ వార్తాకథనం ఏంటి
పాకిస్థాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్(పీటీఐ) చీఫ్, మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్ నేపథ్యంలో జరుగుతున్న నిరసనలు హింసాత్మకంగా మారుతున్నాయి.
ఇమ్రాన్ మద్దతుదారులు పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ లాహోర్ నివాసంపై బుధవారం దాడి చేశారు.
దాదాపు 500 మందికి పైగా పీటీఐ నాయకులు బుధవారం తెల్లవారుజామున ప్రధాని మోడల్ టౌన్ లాహోర్ నివాసానికి చేరుకుని అక్కడ పార్క్ చేసిన వాహనాలను తగులబెట్టారని పోలీసులు తెలిపారు.
అంతేకాకుండా ఇంట్లోలోకి పెట్రోల్ బాంబులు కూడా విసిరినట్లు ఒక సీనియర్ పోలీసు అధికారి వెల్లడించారు.
పాకిస్థాన్
14 ప్రభుత్వ భవనాలు, 21 పోలీసు వాహనాలకు నిప్పు
ఇమ్రాన్ మద్దతుదారులు దాడి చేసినప్పుడు ప్రధాని ఇంటి వద్ద కేవలం గార్డులు మాత్రమే ఉన్నారని పోలీసులు తెలిపారు. అక్కడున్న పోలీసు పోస్టుకు కూడా నిప్పు పెట్టారు. భారీ సంఖ్యలో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకోని నిరసనకారులను చెదరగొట్టారు.
ప్రధానమంత్రి నివాసానికి చేరుకోకముందే మోడల్ టౌన్‌లోని అధికార పీఎంఎల్-ఎన్ సెక్రటేరియట్‌పై కూడా ఇమ్రాన్ మద్దతుదారులు దాడి చేశారు.
గోడలను ధ్వంసం చేశారు. పంజాబ్ ప్రావిన్స్‌లోని గత మంగళవారం, బుధవారాల్లో ఆందోళనకారులు 14 ప్రభుత్వ భవనాలు, 21 పోలీసు వాహనాలకు నిప్పుపెట్టారని పోలీసులు తెలిపారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
ప్రధాని ఇంటి వద్ద ఉద్రిక్తత
Army Chief Asim Munir and Criminal Prime Minister Shehbaz Sharif is responsible for the destabilization of a Nuclear State of Pakistan 🇵🇰.
— 🇺🇸 Bilal Khan ﷽ (@Peace4allpak) May 9, 2023
pic.twitter.com/So9bf3UyzD