
Pakistan: అరేబియా సముద్రంలో కొత్త పోర్టు నిర్మాణంపై అమెరికాతో పాక్ చర్చలు
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికా-పాకిస్థాన్ సంబంధాల్లో కొత్త పరిణామం వెలుగులోకి వచ్చింది. అరేబియా సముద్రంలో కొత్త పోర్ట్ నిర్మాణానికి పాక్ అధికారులు అమెరికా ప్రతినిధులను సంప్రదించారని సమాచారం. ఇటీవల పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, ఆర్మీ చీఫ్ ఆసీం మునీర్ యూఎస్‌లో పర్యటించారు. ఈ పర్యటనలోనే సంబంధిత ప్రతిపాదనలు ఉంచబడ్డాయని ఫైనాన్షియల్ టైమ్స్ వెల్లడించింది. వివిధ మీడియా కథనాల ప్రకారం మునీర్ యూఎస్ అధికారుల ముందు అరేబియా సముద్రంలోని ఓడరేవు నిర్మాణ అంశాన్ని వివరించారు. ఈ పోర్ట్ పాస్నీ ప్రాంతంలోని కీలక ఖనిజాల రవాణాకు ఉపయోగపడవచ్చని పాక్ ఆలోచన. పాస్నీ బలూచిస్థాన్ ప్రావిన్స్‌లో ఉంది.
Details
ఇప్పటివరకూ అధికారిక ప్రకటన వెలువడలేదు
ఇది అఫ్గానిస్తాన్-ఇరాన్ సరిహద్దు సమీపంలో ఉంది. మునీర్ వైట్‌హౌస్ పర్యటనకు ముందే తన సలహాదారుల ద్వారా ఈ అంశంపై యూఎస్ ప్రతినిధులతో చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. అయితే, అమెరికా సైనిక స్థావరాల కోసం ఓడరేవును ఉపయోగించుకోవడాన్ని పాక్ ప్రభుత్వం విరుద్ధంగా భావించింది. దానికి బదులుగా పశ్చిమ పాకిస్థాన్‌లోని ఖనిజాలున్న ప్రావిన్స్‌లకు రైలు కారిడార్ ద్వారా టెర్మినల్‌ను అనుసంధానించే ప్రాజెక్టుకు నిధులు అడిగినట్లు తెలుస్తోంది. ఈ టెర్మినల్ ప్రాజెక్టు గురించి ఇప్పటివరకు ఏ అమెరికా, ఏ పాక్ అధికారుల నుండి అధికారిక స్పందన లభించలేదు.