Page Loader
Operation Sindoor: నివాసాలు, ఆలయాలపై విరుచుకుపడుతున్న పాక్ (వీడియో)
నివాసాలు, ఆలయాలపై విరుచుకుపడుతున్న పాక్ (వీడియో)

Operation Sindoor: నివాసాలు, ఆలయాలపై విరుచుకుపడుతున్న పాక్ (వీడియో)

వ్రాసిన వారు Jayachandra Akuri
May 10, 2025
12:18 pm

ఈ వార్తాకథనం ఏంటి

పాకిస్తాన్‌ చేస్తున్న బుకాయింపులను భారత ఆర్మీ ఖండించింది. సామాన్య పౌరులపై తాము దాడులు చేయలేదన్న పాక్‌ వ్యాఖ్యలు పూర్తిగా నిరాధారమని పేర్కొంది. జమ్మూలోని నివాస ప్రాంతాలు, దేవాలయాలపై పాకిస్తాన్ నిరంతర దాడులకు పాల్పడుతోందని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇందుకు బలమైన ఆధారంగా శంభూ దేవాలయం ధ్వంసమైన దృశ్యాలు ఉన్న వీడియోను రక్షణ శాఖ సోషల్ మీడియాలో విడుదల చేసింది. పాక్ డ్రోన్లు రాత్రంతా భారత భూభాగంపై దాడులకు యత్నించగా, భారత ఆర్మీ వాటిని సమర్థవంతంగా ఎదుర్కొంది. ప్రతి దాడికి తగిన ప్రతిస్పందన ఇవ్వడంలో భారత సైన్యం అప్రమత్తంగా వ్యవహరిస్తోందని పేర్కొంది. దేశ భద్రత, సమగ్రత, సార్వభౌమత్వాన్ని కాపాడేందుకు భారత సాయుధ బలగాలు పూర్తిస్థాయిలో సిద్ధంగా ఉన్నాయని రక్షణ శాఖ స్పష్టం చేసింది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

వీడియో రిలీజ్ చేసిన అధికారులు