Japan: జపాన్‌లో అక్రమ మసీదు నిర్మాణం.. పాక్ కమ్యూనిటీకి రాయబార కార్యాలయం హెచ్చరిక
ఈ వార్తాకథనం ఏంటి
జపాన్‌లోని కవాగోయి నగరంలో నిర్మించిన ఓ మసీదు వివాదానికి కేంద్రబిందువుగా మారింది. స్థానిక నిబంధనలను ఉల్లంఘించి ఈ మసీదు నిర్మాణం చేపట్టినట్లు జపాన్ అధికారులు గుర్తించారు. అంతేకాకుండా, మసీదు ప్రారంభోత్సవ కార్యక్రమానికి జపాన్‌లోని పాకిస్థాన్ రాయబారి అబ్దుల్ హమీద్ హాజరుకావడం ఈ వ్యవహారాన్ని మరింత చర్చనీయాంశంగా మార్చింది. ఈ వివాదంపై స్పందించిన జపాన్‌లోని పాకిస్థాన్ రాయబార కార్యాలయం కీలక వివరణ ఇచ్చింది. మసీదు నిర్మాణ నిర్వాహకులు అన్ని అనుమతులు పొందినట్లుగా తమకు సమాచారం అందించారని, ఆ వివరాలను నమ్మి రాయబారి కార్యక్రమానికి హాజరయ్యారని వెల్లడించింది. అయితే, ప్రస్తుతం వెలుగులోకి వచ్చిన అంశాల ప్రకారం ఈ ప్రాజెక్టుతో తమకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది.
వివరాలు
,500 చదరపు మీటర్ల విస్తీర్ణంలో మసీదు
అదే సమయంలో జపాన్‌లో నివసిస్తున్న పాకిస్థాన్ పౌరులకు రాయబార కార్యాలయం ప్రత్యేక సూచనలు జారీ చేసింది. స్థానిక చట్టాలు, నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని, ముఖ్యంగా ప్రార్థనా మందిరాలు లేదా ఇతర నిర్మాణాల విషయంలో అవసరమైన అనుమతులు పొందిన తర్వాతే పనులు చేపట్టాలని సూచించింది. కాగా, ఈ మసీదు సైతామా ప్రిఫెక్చర్‌లోని కవాగోయి ప్రాంతంలో 4,500 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉన్న భూమిపై నిర్మించబడింది. ఈ భూమిని పర్వత అటవీ ప్రాంతంగా వర్గీకరించారు. అంతేకాకుండా, ఇది పట్టణీకరణ నియంత్రణ జోన్ పరిధిలోకి వస్తుంది. ఈ ప్రాంతంలో ఏ నిర్మాణమైనా చేపట్టాలంటే స్థానిక అధికారుల ప్రత్యేక అనుమతి తప్పనిసరి. అలాంటి అనుమతి లేకుండా సాధారణంగా నిర్మాణాలకు అనుమతి ఉండదని అధికారులు స్పష్టం చేస్తున్నారు.