Imran Khan: ఇమ్రాన్ ఖాన్‌కు కంటి సమస్య.. వైద్య పరీక్షల కోసం ఆస్పత్రికి తరలింపు
ఈ వార్తాకథనం ఏంటి
పాకిస్థాన్ మాజీ ప్రధాని, పాకిస్థాన్ తెహ్రీక్ ఇన్సాఫ్ (పీటీఐ) పార్టీ వ్యవస్థాపకుడు ఇమ్రాన్ ఖాన్‌ను కంటి చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. 2023 నుంచి ఆయన జైలులో ఉంటున్న విషయం తెలిసిందే. ఆయనపై 100కు పైగా కేసులు నమోదయ్యాయి. అవినీతి, హింసను ప్రేరేపించడం వంటి ఆరోపణలతో ఆయన నిందితుడిగా ఉన్నారు. ప్రస్తుతం రావల్పిండిలోని అడియాలా జైలులో ఇమ్రాన్ ఖాన్‌ను నిర్బంధించారు.
వివరాలు
ఇమ్రాన్ ఖాన్ కు ఇంట్రావిట్రియల్ యాంటీ-వీఈజీఎఫ్ ఇంజెక్షన్
గత జనవరి నుంచి ఇమ్రాన్ ఖాన్ తన కుడి కంటికి చికిత్స పొందుతున్నారు. చూపు మందగిస్తున్నట్లు ఆయన ఫిర్యాదు చేయడంతో వైద్యులు చికిత్స ప్రారంభించారు.
ఈ నేపథ్యంలో వైద్య పరీక్షల కోసం ఆయనను పాకిస్థాన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (పీఐఎంఎస్)కు తరలించారు.
ఇమ్రాన్‌కు చికిత్స అందిస్తున్న కంటి వైద్యుడి సూచన మేరకే పరీక్షలు నిర్వహించినట్లు పీఐఎంఎస్ అధికారి వెల్లడించారు.
చికిత్సలో భాగంగా ఆయనకు ఇంట్రావిట్రియల్ యాంటీ-వీఈజీఎఫ్ ఇంజెక్షన్ ఇచ్చారు.
ఇదిలా ఉండగా, ఇమ్రాన్ ఖాన్ 2018లో పాకిస్థాన్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు.
అయితే 2022లో జరిగిన అవిశ్వాస తీర్మానంలో ఓడిపోవడంతో ఆయన ప్రధాని పదవిని కోల్పోయారు.