LOADING...
Lindsey Graham: ఇరాన్‌ చర్చల్లో పాక్‌ పాత్రపై అమెరికా సెనెటర్ ఆగ్రహం
ఇరాన్‌ చర్చల్లో పాక్‌ పాత్రపై అమెరికా సెనెటర్ ఆగ్రహం

Lindsey Graham: ఇరాన్‌ చర్చల్లో పాక్‌ పాత్రపై అమెరికా సెనెటర్ ఆగ్రహం

వ్రాసిన వారు Sirish Praharaju
May 27, 2026
08:53 am

ఈ వార్తాకథనం ఏంటి

పాకిస్థాన్‌పై అమెరికా సెనెటర్ లిండ్సేగ్రాహం తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. అమెరికా-ఇరాన్‌ మధ్య కొనసాగుతున్న శాంతి చర్చల్లో పాకిస్థాన్‌ మధ్యవర్తిత్వం వహిస్తోన్న పరిస్థితిపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పాకిస్థాన్‌ మధ్యవర్తిగా వ్యవహరించడమే ప్రధాన సమస్యగా మారిందని వ్యాఖ్యానించారు. ఇరాన్‌తో జరుగుతున్న శాంతి చర్చల్లో పాల్గొనే దేశాలు అబ్రహాం ఒప్పందాలపై సంతకాలు చేయాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ఇటీవల పిలుపునిచ్చారు. అయితే, ఇజ్రాయెల్‌తో ఉన్న విభేదాల కారణంగా పాకిస్థాన్‌ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్‌ ఆ ప్రతిపాదనను తిరస్కరించారు.

వివరాలు 

ఇజ్రాయెల్‌పై పాకిస్థాన్‌ చాలా కాలంగా విద్వేష భావన

ఈ పరిణామాల నేపథ్యంలో లిండ్సే గ్రాహం సామాజిక మాధ్యమ వేదిక ఎక్స్‌లో స్పందించారు. ఇజ్రాయెల్‌పై పాకిస్థాన్‌ చాలా కాలంగా విద్వేష భావనతో వ్యవహరిస్తోందని ఆయన ఆరోపించారు. గతంలో పాక్‌కు చెందిన ఉన్నతాధికారులు చేసిన వ్యాఖ్యలు కూడా తీవ్ర ఆందోళన కలిగించాయని తెలిపారు. ఇజ్రాయెల్‌పై నమ్మకం లేకపోవడంతో అబ్రహాం ఒప్పందాల్లో పాల్గొనబోమని ఖవాజా ఆసిఫ్‌ చేసిన వ్యాఖ్యలను లిండ్సే ప్రత్యేకంగా ప్రస్తావించారు.

వివరాలు 

పాకిస్థాన్‌లోని వైమానిక స్థావరాల్లో ఇరాన్‌కు చెందిన సైనిక విమానాలు

ఆ వ్యాఖ్యలు తనను కలవరానికి గురిచేశాయని పేర్కొన్నారు. ట్రంప్‌ చేసిన పిలుపుపై పాకిస్థాన్‌ వెంటనే స్పష్టత ఇవ్వాలని ఆయన డిమాండ్‌ చేశారు. ఇటీవల అమెరికాతో ఉద్రిక్తతల నేపథ్యంలో ఇరాన్‌కు చెందిన సైనిక విమానాలు పాకిస్థాన్‌లోని వైమానిక స్థావరాల్లో నిలిపివేశారనే వార్తలు వెలువడిన సంగతి తెలిసిందే. ఈ అంశాన్ని కూడా లిండ్సే తన వ్యాఖ్యల్లో ప్రస్తావించారు. ఆ వార్తలను పూర్తిగా అసత్యమని కొట్టిపారేయలేమని ఆయన పేర్కొన్నారు.

Advertisement

ట్విట్టర్ పోస్ట్ చేయండి

లిండ్సే చేసిన ట్వీట్ 

Advertisement