Page Loader
Jaffar Express: మరోసారి ప్రమాదానికి గురైన పాకిస్థాన్‌ లో జాఫర్‌ ఎక్స్‌ప్రెస్‌ .. రైల్వే ట్రాక్‌పై బాంబు పేలుడు 
మరోసారి ప్రమాదానికి గురైన పాకిస్థాన్‌ లో జాఫర్‌ ఎక్స్‌ప్రెస్‌ .. రైల్వే ట్రాక్‌పై బాంబు పేలుడు

Jaffar Express: మరోసారి ప్రమాదానికి గురైన పాకిస్థాన్‌ లో జాఫర్‌ ఎక్స్‌ప్రెస్‌ .. రైల్వే ట్రాక్‌పై బాంబు పేలుడు 

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 18, 2025
03:09 pm

ఈ వార్తాకథనం ఏంటి

పాకిస్థాన్‌లో జాఫర్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు మరోసారి ఘోర ప్రమాదానికి గురైంది. సింధ్‌ ప్రావిన్స్‌లోని జకోబాబాద్‌ వద్ద రైల్వే ట్రాక్‌పై బాంబు పేలుడు చోటుచేసుకుంది. ఇదే సమయంలో ఆ మార్గంలో వెళ్తున్న జాఫర్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు బాంబు ప్రభావంతో పట్టాలు తప్పింది. ఈ పేలుడు ఐఈడీ బాంబు ఏర్పాటు చేసిన కారణంగానే సంభవించినట్లు సమాచారం. క్వెట్టా నుంచి పెషావర్‌కు వెళ్తున్న ఈ రైలు ప్రమాదంలో ఆరు బోగీలు పట్టాలు తప్పాయి. అయితే ఈ ఘటనలో ఎవరికీ ప్రాణహానీ జరగలేదని స్థానిక మీడియా తెలిపింది.

వివరాలు 

214 మంది పాకిస్థాన్‌ సైనికులు హతం 

ఇక్కడ ఒక ముఖ్యమైన అంశం ఏమిటంటే.. ఈ ఏడాది జాఫర్‌ ఎక్స్‌ప్రెస్‌పై ఇది రెండవసారి దాడి జరగడం. గత మార్చిలో, ఇదే రైలును బలోచిస్తాన్‌ ప్రాంతానికి చెందిన వేర్పాటువాద మిలిటెంట్లు హైజాక్‌ చేశారు. వారు రైలులో ప్రయాణిస్తున్న వందలాది మంది ప్రయాణికులను బందీలుగా పట్టుకున్నారు. వారికి సహాయం చేసేందుకు వెళ్లిన పాక్‌ ఆర్మీపై తీవ్రంగా దాడి చేసి పలు బలగాల సభ్యులను హతమార్చారు. అనంతరం పాకిస్థాన్‌ సైన్యం ఓ ప్రత్యేక ఆపరేషన్‌ నిర్వహించి బందీలను కాపాడింది. అయితే అప్పట్లో బలూచిస్థాన్‌ లిబరేషన్‌ ఆర్మీ ప్రకారం, ఆ దాడిలో 214 మంది పాకిస్థాన్‌ సైనికులు హతమయ్యారని వారు ప్రకటించడం గమనార్హం.