
Pete Hegseth: అమెరికా రక్షణ మంత్రి విమానం అత్యవసర ల్యాండింగ్!
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికా రక్షణమంత్రి పీట్ హెగ్సెత్ వ్యక్తిగత విమానం యూకేలో అత్యవసరంగా ల్యాండ్ అయ్యింది. విమానం విండ్‌షీల్డ్‌లో పగుళ్లు పడ్డ కారణంగా ఈఅత్యవసర స్థితి ఏర్పడినట్లు తెలిసింది. హెగ్సెత్ ఇటీవల బ్రస్సెల్స్‌లో జరిగిన నాటో రక్షణమంత్రుల సమావేశంలో పాల్గొని తిరిగి అమెరికాకు వస్తుండగా ఇది జరిగింది. ఈ విషయాన్ని పెంటగాన్ అధికారికంగా ధృవీకరించింది.హెల్గ్‌సెట్ సహా విమానంలో ఉన్న అన్ని ప్రయాణికులు సురక్షితంగా ఉన్నారని,పెంటగాన్ ప్రతినిధి సీన్ పార్నెల్ వెల్లడించారు. ఇక నాటో సమావేశంలో హెగ్సెత్ ఉక్రెయిన్‌పై దూకుడు వ్యవహరిస్తున్నరష్యాకు కీలక హెచ్చరికలు ఇచ్చారు. మాస్కో దూకుడు కొనసాగిస్తే,అమెరికా, దాని మిత్రదేశాలతో కలిసి రష్యా వ్యతిరేక నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటాయని ఆయన తెలిపారు. అలాగే,ఉక్రెయిన్ రక్షణ సామర్థ్యాన్ని పెంచడానికి కూటమి దృష్టి సారిస్తున్నదని హెగ్సెత్ తెలిపారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
అమెరికా రక్షణ మంత్రి విమానం అత్యవసర ల్యాండింగ్!
Hegseth is SAFE — Pentagon confirms
— RT (@RT_com) October 15, 2025
Crack in plane's windshield, forced to land in UK https://t.co/eLBpXJDuzW pic.twitter.com/eLhRjfjWRY