LOADING...
Austria: ఆస్ట్రియా ఆల్ప్స్‌లో గాల్లో ఘోర ప్రమాదం.. పారాగ్లైడర్‌ను ఢీకొట్టిన చిన్న విమానం
ఆస్ట్రియా ఆల్ప్స్‌లో గాల్లో ఘోర ప్రమాదం.. పారాగ్లైడర్‌ను ఢీకొట్టిన చిన్న విమానం

Austria: ఆస్ట్రియా ఆల్ప్స్‌లో గాల్లో ఘోర ప్రమాదం.. పారాగ్లైడర్‌ను ఢీకొట్టిన చిన్న విమానం

వ్రాసిన వారు Sirish Praharaju
May 25, 2026
10:41 am

ఈ వార్తాకథనం ఏంటి

ఆస్ట్రియాలోని ఆల్ప్స్‌ పర్వత ప్రాంతంలో సంచలన ఘటన చోటుచేసుకుంది. విహారయాత్రలో భాగంగా గాల్లో ప్రయాణిస్తున్న ఓ చిన్న విమానం.. పారాగ్లైడింగ్‌ చేస్తున్న మహిళను ఢీకొట్టింది. దీంతో పారాగ్లైడర్‌ ఒక్కసారిగా చిద్రమైపోయింది. ఈ ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా వైరల్‌గా మారాయి. వైరల్‌గా మారిన వీడియోలో చిన్న విమానం పారాగ్లైడర్‌ను నేరుగా ఢీకొట్టి మధ్య నుంచి చీల్చుకుంటూ వెళ్లిన దృశ్యాలు స్పష్టంగా కనిపించాయి. ప్రమాదం జరిగిన వెంటనే పారాగ్లైడింగ్‌ చేస్తున్న మహిళ గాల్లో అదుపు కోల్పోయి పలుమార్లు తిరుగుతూ కిందకు పడిపోయింది. అయితే అప్రమత్తంగా వ్యవహరించిన ఆమె చివరి క్షణంలో అత్యవసర పారాచూట్‌ను తెరవడంతో ప్రాణాపాయం నుంచి బయటపడింది.

వివరాలు 

కెమెరాలో రికార్డయిన స్క్మిటెన్‌హోహే పర్వత ప్రాంతంలో జరిగిన ఘటన

స్క్మిటెన్‌హోహే పర్వత ప్రాంతంలో జరిగిన ఈ ఘటన మొత్తం ఆమె కెమెరాలో రికార్డైంది. సమాచారం అందుకున్న అత్యవసర సిబ్బంది హెలికాప్టర్‌తో అక్కడికి చేరుకుని ఆమెను ఆస్పత్రికి తరలించారు. స్వల్ప గాయాలతోనే ఆమె ప్రమాదం నుంచి బయటపడినట్లు అధికారులు వెల్లడించారు. ప్రమాదంలో చిక్కుకున్న మహిళ పేరు సబ్రినా(44)గా గుర్తించారు. ఆమెకు పారాగ్లైడింగ్‌లో మంచి అనుభవం ఉన్నట్లు సమాచారం.మరోవైపు ఢీకొన్న తేలికపాటి విమానం జెల్‌ ఆమ్‌ సీ విమానాశ్రయంలో సురక్షితంగా దిగింది. ఈ ప్రమాదాన్ని తప్పించలేకపోయానని 28 ఏళ్ల పైలట్‌ అధికారులకు వివరించినట్లు తెలుస్తోంది. గాల్లో భద్రతా ప్రమాణాలపై మరోసారి చర్చకు ఈ ఘటన కారణమైంది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

ఆస్ట్రియా ఆల్ప్స్‌లో గాల్లో ఘోర ప్రమాదం

Advertisement