LOADING...
PM Modi: ఇండోనేసియా పర్యటనలో మోదీకి అరుదైన గౌరవం.. స్వయంగా స్వాగతించిన అధ్యక్షుడు
ఇండోనేసియా పర్యటనలో మోదీకి అరుదైన గౌరవం.. స్వయంగా స్వాగతించిన అధ్యక్షుడు

PM Modi: ఇండోనేసియా పర్యటనలో మోదీకి అరుదైన గౌరవం.. స్వయంగా స్వాగతించిన అధ్యక్షుడు

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 07, 2026
11:00 am

ఈ వార్తాకథనం ఏంటి

భారత ప్రధాని నరేంద్ర మోదీకి ఇండోనేసియా రాజధాని జకార్తాలో అరుదైన గౌరవం లభించింది. ఆస్ట్రేలియా,న్యూజిలాండ్‌తో పాటు మూడు దేశాల పర్యటనలో భాగంగా ఆయన సోమవారం ఇండోనేసియా చేరుకున్నారు. మోదీ ప్రయాణిస్తున్న ప్రత్యేక విమానం జకార్తా గగనతలంలోకి ప్రవేశించిన వెంటనే ఇండోనేసియా వైమానిక దళానికి చెందిన యుద్ధవిమానాలు భద్రతా ఎస్కార్ట్‌గా వెంట సాగాయి.ఈప్రత్యేక స్వాగతం అందరి దృష్టిని ఆకర్షించింది. జకార్తా విమానాశ్రయానికి స్వయంగా వచ్చిన ఇండోనేసియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంతో ప్రధాని మోదీకి ఆత్మీయంగా స్వాగతం పలికారు. అనంతరం సంప్రదాయ పద్ధతిలో స్వాగత కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు గౌరవ వందనం సమర్పించారు. ఈ ఆతిథ్యంపై ప్రధాని మోదీ సామాజిక మాధ్యమాల ద్వారా స్పందిస్తూ,అధ్యక్షుడు ప్రబోవో సుబియాంతో చూపిన ఆత్మీయత తనను ఎంతో హత్తుకుందని పేర్కొన్నారు.

వివరాలు 

2018 తర్వాత తొలి ద్వైపాక్షిక పర్యటన

2018లో భారత్-ఇండోనేసియా సంబంధాలను సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్య స్థాయికి తీసుకెళ్లిన తర్వాత ప్రధాని మోదీ చేపడుతున్న తొలి ద్వైపాక్షిక పర్యటన ఇదే. గత కొన్ని సంవత్సరాల్లో ఈ భాగస్వామ్యం ఇరు దేశాల ప్రజలకు విశేష ప్రయోజనాలు అందించిందని ఆయన తెలిపారు. అధ్యక్షుడు ప్రబోవో సుబియాంతో జరగనున్న ద్వైపాక్షిక చర్చలు వాణిజ్యం, పెట్టుబడులు, భద్రత, సముద్ర సహకారం, సాంకేతికత, సాంస్కృతిక రంగాలతో పాటు పలు కీలక అంశాల్లో రెండు దేశాల మధ్య సహకారాన్ని మరింత విస్తరించనున్నాయని మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు.

వివరాలు 

2018 తర్వాత తొలి ద్వైపాక్షిక పర్యటన

ఈ పర్యటనలో భాగంగా యోగ్యకర్తలోని ప్రపంచ ప్రసిద్ధి చెందిన ప్రంబనన్ హిందూ దేవాలయ సముదాయాన్ని అధ్యక్షుడు ప్రబోవో సుబియాంతో కలిసి సందర్శించనున్నట్లు ప్రధాని మోదీ వెల్లడించారు. ఈ సందర్శన ద్వారా భారత్-ఇండోనేసియా మధ్య శతాబ్దాల నాటి సాంస్కృతిక, ఆధ్యాత్మిక బంధాలు మరింత బలోపేతం అవుతాయని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.

Advertisement