Loading...
PoK: ఉద్రిక్తతల నడుమ పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో పోలింగ్ ప్రారంభం
ఉద్రిక్తతల నడుమ పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో పోలింగ్ ప్రారంభం

PoK: ఉద్రిక్తతల నడుమ పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో పోలింగ్ ప్రారంభం

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 27, 2026
09:57 am

ఈ వార్తాకథనం ఏంటి

తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల మధ్య పాక్ ఆక్రమిత కశ్మీర్‌ (పీఓకే)లో అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ సోమవారం ప్రారంభమైంది. గత కొన్ని వారాలుగా కొనసాగుతున్న నిరసనలు, హింసాత్మక ఘటనల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పాకిస్థాన్ ప్రభుత్వం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది. ఎన్నికల ప్రాంతాలన్నింటిలోనూ భద్రతా బలగాలను భారీగా మోహరించి పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తోంది. పీఓకే శాసనసభలో మొత్తం 53 స్థానాలు ఉండగా,వాటిలో 45 స్థానాలకు ప్రత్యక్ష ఎన్నికలు నిర్వహిస్తున్నారు. మిగిలిన ఎనిమిది స్థానాలను మహిళలు, సాంకేతిక నిపుణులు, మతపెద్దలకు రిజర్వ్ చేశారు. ఈ ఎన్నికలను మూడు విడతల్లో నిర్వహించనున్నారు. తొలి దశలో జూలై 27న మీర్‌పూర్ డివిజన్‌కు చెందిన 13 స్థానాలకు పోలింగ్ జరుగుతోంది.

వివరాలు 

14 వేల మంది పోలీసుల మోహరింపు

రెండో దశలో ఆగస్టు 2న ముజఫరాబాద్ డివిజన్‌తో పాటు శరణార్థుల నియోజకవర్గాల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు.

చివరి దశలో ఆగస్టు 10న పూంచ్ డివిజన్ పరిధిలోని స్థానాలకు ఓటింగ్ జరగనుంది.

ఎన్నికల సందర్భంగా హింస చెలరేగే అవకాశం ఉందని భావించిన అధికారులు ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టారు.

ఇందులో భాగంగా పంజాబ్ ప్రావిన్స్ నుంచి సుమారు 14వేల మంది పోలీసు సిబ్బందిని పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో మోహరించారు.

పోలింగ్ కేంద్రాలు,సున్నిత ప్రాంతాల్లో అదనపు భద్రత కల్పిస్తూ శాంతిభద్రతల పరిరక్షణపై ప్రత్యేక దృష్టి సారించారు.

ఈఎన్నికల్లో ప్రధానంగా పాకిస్థాన్ ముస్లిం లీగ్ (నవాజ్),పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ మధ్య పోటీ నెలకొంది.

కాగా,మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు చెందిన పార్టీ ఈ ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించింది.

ADVERTISEMENT