Nirav Modi: నీరవ్ అప్పగింతలో జాప్యం.. బ్రిటన్‌పై ప్రీతి పటేల్ విమర్శలు
ఈ వార్తాకథనం ఏంటి
పంజాబ్ నేషనల్ బ్యాంకు (పీఎన్‌బీ)కి సుమారు 200 కోట్ల డాలర్ల మేర మోసం చేసిన వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ ఇప్పటికీ బ్రిటన్‌లోనే ఉండటం ఆశ్చర్యకరమని బ్రిటన్ మాజీ హోం మంత్రి,భారత సంతతికి చెందిన ప్రముఖ నాయకురాలు ప్రీతి పటేల్ వ్యాఖ్యానించారు. నీరవ్ మోదీని భారత్‌కు అప్పగించేందుకు అవసరమైన ఉత్తర్వులపై తాను హోం మంత్రిగా ఉన్న సమయంలోనే,2021 ఏప్రిల్‌లో సంతకం చేసిన విషయాన్ని ఆమె గుర్తు చేశారు. అప్పగింత ప్రక్రియలో ఎలాంటి సాకులు,అనవసర జాప్యాలు లేకుండా సంబంధిత వ్యవస్థలు సమర్థంగా పనిచేసి ఉంటే,నీరవ్ మోదీ ఇప్పటికీ బ్రిటన్‌లో ఉండే పరిస్థితి వచ్చేది కాదని ఆమె స్పష్టం చేశారు.
వివరాలు
బ్రిటన్‌తో న్యాయపరమైన సహకారంపై భారత ప్రభుత్వంలో నిరాసక్తత
నీరవ్ మోదీ అప్పగింత విషయంలో బ్రిటన్ వైఖరిపై అప్పట్లో భారత అధికార వర్గాల్లో తీవ్ర అసంతృప్తి, ఆగ్రహం వ్యక్తమైందని వెల్లడించారు.
అప్పగింత ప్రక్రియ ఇప్పటికీ పూర్తి కాకపోవడం, వరుసగా జాప్యం కొనసాగుతుండటం వల్ల బ్రిటన్‌తో న్యాయపరమైన సహకారంపై భారత ప్రభుత్వంలో నిరాసక్తత పెరిగి ఉండొచ్చని ప్రీతి పటేల్ అభిప్రాయపడ్డారు.
ప్రస్తుతం బ్రిటన్ విదేశాంగ శాఖ షాడో మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న ప్రీతి పటేల్, 'ది డైమండ్ కింగ్' పేరుతో రూపొందుతున్న పాడ్‌కాస్ట్‌లో ఈ అంశాలపై మాట్లాడారు. కాగా, 55 ఏళ్ల నీరవ్ మోదీ ప్రస్తుతం లండన్‌లోని జైలులో ఉన్న విషయం తెలిసిందే.