Philippines: దక్షిణ ఫిలిప్పీన్స్‌లో ఆరుగురు విదేశీయులతో వెళ్తున్న విమానం క్రాష్
ఈ వార్తాకథనం ఏంటి
ఫిలిప్పీన్స్‌లో ఓ ప్రైవేట్ విమానం ప్రమాదానికి గురైంది. ఆరుగురు విదేశీయులతో ప్రయాణిస్తున్న ఈ విమానం దక్షిణ ఫిలిప్పీన్స్‌లో మంగళవారం కుప్పకూలింది. ఈ విషయాన్ని డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అధికారి వెల్లడించారు. ప్రస్తుతం ప్రమాద స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. విమానంలో ప్రయాణిస్తున్న వారు లేదా సిబ్బందిలో ఎవరైనా మరణించారా? అనే విషయం ఇంకా స్పష్టత రాలేదని దావావో డెల్ సుర్‌లోని డిగోస్ నగరానికి చెందిన అధికారి జోమార్ కాలెడో తెలిపారు. విమానంలో ఉన్న ప్రయాణికులు, సిబ్బంది పరిస్థితి ఎలా ఉంది? ప్రమాదానికి అసలు కారణం ఏమిటి? అనే వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. సహాయక చర్యలు పూర్తయిన తర్వాత ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
దక్షిణ ఫిలిప్పీన్స్‌లో విమాన ప్రమాదం
Private plane carrying six foreign nationals crashes in Philippines
— DailyMirror (@Dailymirror_SL) November 10, 2026
Read more 👇https://t.co/5zSzjgUFMR pic.twitter.com/Ft0jb143Xy