Russia: సుఖోయ్ ఎస్‌యూ-57పై రష్యా ప్రతిపాదన.. భారత్‌తో కలిసి తయారీకి సిద్ధం
ఈ వార్తాకథనం ఏంటి
భారత వైమానిక దళ సామర్థ్యాలను మరింత పెంచే లక్ష్యంతో ఐదోతరం యుద్ధ విమానాల సమీకరణపై దృష్టి సారించిన నేపథ్యంలో రష్యా కీలక ప్రతిపాదనతో ముందుకొచ్చింది. అధునాతన స్టెల్త్ సాంకేతికతతో కూడిన సుఖోయ్ ఎస్‌యూ-57 యుద్ధవిమానాలను భారత్‌తో కలిసి సంయుక్తంగా అభివృద్ధి చేసి,ఉత్పత్తి చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ వెల్లడించారు. అంతేకాకుండా,ఈ ప్రాజెక్టుకు అవసరమైన కీలక సాంకేతిక పరిజ్ఞానాన్ని భారత్‌తో పంచుకునేందుకు కూడా రష్యా ఆసక్తి చూపుతున్నట్లు తెలిపారు. సెయింట్ పీటర్స్‌బర్గ్‌లో నిర్వహించిన సమావేశంలో అంతర్జాతీయ వార్తాసంస్థల ప్రతినిధులతో మాట్లాడిన సందర్భంగా పుతిన్ ఈ విషయాన్ని వెల్లడించారు. భారత్‌తో రక్షణ రంగ సహకారాన్ని మరింత విస్తరించాలన్న ఉద్దేశంతో ఈ ప్రతిపాదన చేస్తున్నట్లు ఆయన సంకేతాలు ఇచ్చారు.
వివరాలు
భారత వైమానిక దళం వద్ద ఐదోతరం యుద్ధ విమానాలు లేవు
ప్రస్తుతం భారత వైమానిక దళం వద్ద ఐదోతరం యుద్ధ విమానాలు లేవు. ఇదే సమయంలో పాకిస్థాన్ త్వరలో చైనాకు చెందిన షెన్‌యాంగ్ జె-35ఏఈ స్టెల్త్ ఫైటర్ జెట్‌లను కొనుగోలు చేసే అవకాశాలపై వార్తలు వెలువడుతున్నాయి. ఈ పరిణామాల మధ్య రష్యా నుంచి వచ్చిన తాజా ఆఫర్ వ్యూహాత్మకంగా ప్రాధాన్యం సంతరించుకుంది. భారత్ తన భవిష్యత్ వైమానిక అవసరాల కోసం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నదానిపై ఇప్పుడు ఆసక్తి నెలకొంది.