కొంత కాలానికి భారత్‌తో సంబంధాలు బలహీన పడొచ్చు: అమెరికా రాయబారి
భారత్, కెనడా మధ్య వివాదంపై కొత్త అంశాలు తెరపైకి వస్తున్నాయి. ఈ పరిమాణాలు ఎటువంటి పరిస్థితులకు దారి తీస్తాయో తెలియడం లేదు. ఖలీస్థాన్ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ ను జూన్ నెలలో గుర్తు తెలియని వ్యక్తులు కాల్పి చంపారు. అయితే భారత ఏజెంట్లే ఈ పని చేశారని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఇటీవల ఆరోపించిన విషయం తెలిసిందే. తమ దగ్గర ఆధారాలు ఉన్నాయంటూ, ఐదు దేశాల ఇంటెలిజెన్స్ కూటమి (అమెరికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, బ్రిటన్, కెనడా)కి నివేదించారు. ఆధారాలు ఉంటే తమకే చూపించాలని భారత్ డిమాండ్ చేసింది.
కెనడాకు మద్దతు పలికేలా ఎరిక్ గార్సెట్టి కీలక వ్యాఖ్యలు
ఈ వ్యవహరంపై కెనడా దర్యాప్తును భారత్ సహకరించాలని అమెరికా సూచించింది. దీనిపై భారత్ వైఖరిని అమెరికా జాతీయ భద్రతా సలహాదారు, అమెరికా విదేశాంగ మంత్రికి విదేశాంగ మంత్రి జై శంకర్ తెలియజేశారు. ఇదిలా ఉంటే భారత్‌లో అమెరికా రాయబారి ఎరిక్ గార్సెట్టి మాత్రం కెనడాకు మద్దతు పలికేలా వ్యాఖ్యలు చేశారు. కెనడాతో దౌత్యం వివాదం ఫలితంగా భారత్, ఆమెరికా మధ్య సంబంధాలు కొంత కాలానికి క్షీణించే అవకాశం ఉంటుందని గ్యార్సెట్టి పేర్కొన్నారు. అయితే జోబైడెన్ ప్రభుత్వంలోని కొందరు మాత్రం భారత ప్రధాని నరేంద్ర మోదీతో సంబంధాలు సమీప కాలంలో మరింత సన్నిహితంగా ఉంటాయని విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.