LOADING...
Trump: హమాస్‌కు డొనాల్డ్ ట్రంప్ వార్నింగ్‌, బందీలను విడుదల చేయండి..ఇదే మీకు చివరి అవకాశం
హమాస్‌కు డొనాల్డ్ ట్రంప్ వార్నింగ్‌, బందీలను విడుదల చేయండి..ఇదే మీకు చివరి అవకాశం

Trump: హమాస్‌కు డొనాల్డ్ ట్రంప్ వార్నింగ్‌, బందీలను విడుదల చేయండి..ఇదే మీకు చివరి అవకాశం

వ్రాసిన వారు Sirish Praharaju
Mar 06, 2025
09:35 am

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి హమాస్‌కు తీవ్ర హెచ్చరిక జారీ చేశారు. ఆ సంస్థ చెరలో ఉన్న మిగిలిన బందీలను వెంటనే విడుదల చేయకుంటే గాజా ప్రాంతాన్ని మరింత నాశనం చేస్తానని గట్టి హెచ్చరికలు చేశారు. ఈ మేరకు ఆయన ట్రూత్‌ సోషల్‌లో ఓ పోస్ట్ చేశారు.

వివరాలు 

బందీలను వెంటనే విడుదల చేయాలి

'మీ చెరలో ఉన్న బందీలను వెంటనే విడుదల చేయాలి.మరణించిన వారి శవాలను తిరిగి అందించాలి.లేకుంటే దానికి తగిన పరిణామాలను ఎదుర్కొంటారు.ఈ విషయంలో ఇజ్రాయెల్‌కు అవసరమైన అన్ని రకాల సహాయాన్ని అందజేస్తాను. నా హెచ్చరికను పట్టించుకోకపోతే,హమాస్‌కు చెందిన ఏ ఒక్క వ్యక్తి కూడా సురక్షితంగా ఉండడు.మీ చెర నుంచి విడిపించి ఇటీవల విడుదలైన బందీలను నేను కలిశాను.ఇదే మీకు చివరి హెచ్చరిక. గాజా ప్రజల భవిష్యత్తు వెలుగుగా మారాలంటే మీరు ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టండి' అని ట్రంప్ పేర్కొన్నారు.

వివరాలు 

 హమాస్‌ను పలుమార్లు హెచ్చరించిన ట్రంప్ 

ఇంతకు ముందుగానూ ట్రంప్ హమాస్‌ను పలుమార్లు హెచ్చరించారు. బందీలను విడుదల చేయకపోతే తీవ్రమైన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. ఇటీవల అమెరికా పర్యటనలో భాగంగా ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో గాజా పరిస్థితులపై చర్చించారు. అనంతరం గాజాను స్వాధీనం చేసుకుని పునర్నిర్మించాలనే ఉద్దేశాన్ని వ్యక్తం చేశారు. ఈ ప్రకటన అంతర్జాతీయంగా ఆసక్తి రేపింది. పాలస్తీనియన్లు పశ్చిమ ఆసియాలోని ఇతర ప్రాంతాలకు వెళ్లి శాశ్వతంగా స్థిరపడాలని ఆయన సూచించారు. అయితే, ఈ ప్రతిపాదనను సౌదీ అరేబియా, జోర్దాన్ సహా అనేక దేశాలు తీవ్రంగా వ్యతిరేకించాయి.

వివరాలు 

గాజాకు సరఫరా అవుతున్న మానవతా సహాయం నిలిపివేత 

ఇక, ఇజ్రాయెల్-హమాస్ మధ్య తొలిదశ ఒప్పందం ఇటీవల ముగిసిన విషయం తెలిసిందే. ఇది ముగిసిన అనంతరం, అమెరికా దీన్ని పొడిగించాలనే ప్రస్తావనను తీసుకొచ్చింది. ఈ ఒప్పందంలో భాగంగా హమాస్ తన చెరలో ఉన్న బందీలలో సగం మందిని విడుదల చేయాలని ఇజ్రాయెల్ డిమాండ్ చేసింది. దీనిని ఇజ్రాయెల్ ఆమోదించగా, హమాస్ తిరస్కరించింది. దీంతో గాజాకు సరఫరా అవుతున్న మానవతా సహాయాన్ని ఇజ్రాయెల్ నిలిపివేసింది. ఈ చర్యను అనేక దేశాలు ఖండించాయి.