LOADING...
Donald Trump:'నేను బాధ్యతలు స్వీకరించే ముందు బందీలను విడుదల చేయండి'.. ట్రంప్‌ హెచ్చరిక
'నేను బాధ్యతలు స్వీకరించే ముందు బందీలను విడుదల చేయండి'.. ట్రంప్‌ హెచ్చరిక

Donald Trump:'నేను బాధ్యతలు స్వీకరించే ముందు బందీలను విడుదల చేయండి'.. ట్రంప్‌ హెచ్చరిక

వ్రాసిన వారు Jayachandra Akuri
Jan 08, 2025
10:34 am

ఈ వార్తాకథనం ఏంటి

ఇజ్రాయెల్, హమాస్‌ల మధ్య పోరు కొనసాగుతోంది. ఈ క్రమంలో అమెరికాకు కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హమాస్‌పై తీవ్ర విమర్శలు చేశారు. తాను అధికార బాధ్యతలు స్వీకరించే ముందు బందీలను విడుదల చేయాలని కోరారు. తాను బాధ్యతలు స్వీకరించిన తర్వాత వారు తిరిగి రాకపోతే, పశ్చిమాసియాలో ఆకస్మిక దాడులు జరిగే అవకాశం ఉందన్నారు. బందీల విడుదలపై చర్చలు చివరి దశకు చేరుకున్నాయని మధ్యప్రాచ్యంలోని అమెరికా ప్రత్యేక రాయబారి స్టీవెన్ చార్లెస్ విట్కాఫ్ పేర్కొన్నారు. డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు స్వీకరించే నాటికి కొన్ని మంచి వార్తలు ప్రకటించాలని ఆశిస్తున్నామని చెప్పారు. హమాస్ ఇప్పటికే బందీలను విడుదల చేయాల్సి ఉన్నా వారు ఇప్పటి వరకు విడుదల చేయలేదు.

Details

గతంలోనూ హమాస్ ను హెచ్చరించిన ట్రంప్

అక్టోబరు 7న జరిగిన దాడిలో అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. ట్రంప్ గతంలోనూ హమాస్‌ను హెచ్చరించారు. జనవరి 20 నాటికి తన బాధ్యతలు స్వీకరించే ముందు బందీలను విడుదల చేయకపోతే, ఈ దురాగతాలు చేసేవారికి అశాశ్వత పరిణామాలు ఎదురవుతాయని ఆయన స్పష్టం చేశారు. 2023లో ఇజ్రాయెల్‌పై హమాస్ దాడిలో 1,200 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. 251 మందిని హమాస్ బంధించి గాజాలోకి తీసుకెళ్లింది. తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం ద్వారా కొంతమంది బందీలను విడుదల చేసినా ఇంకా 97 మంది హమాస్ చెరలో ఉన్నారు.