LOADING...
Russia: గూఢచర్య ఆరోపణలతో బ్రిటిష్ దౌత్యవేత్త మాస్కో నుంచి బహిష్కరణ
గూఢచర్య ఆరోపణలతో బ్రిటిష్ దౌత్యవేత్త మాస్కో నుంచి బహిష్కరణ

Russia: గూఢచర్య ఆరోపణలతో బ్రిటిష్ దౌత్యవేత్త మాస్కో నుంచి బహిష్కరణ

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 15, 2026
04:53 pm

ఈ వార్తాకథనం ఏంటి

మాస్కోలోని బ్రిటిష్ దౌత్యవేత్తను గూఢచర్య ఆరోపణల కారణంగా రష్యా దేశం నుంచి బహిష్కరించినట్లు రష్యా భద్రతా అధికారులు ప్రకటించారు. ఫెడరల్ సెక్యూరిటీ సర్వీస్ (FSB) ప్రకారం, మాస్కోలోని బ్రిటన్ రాయబార కార్యాలయంలో కార్యదర్శి గారెత్ శామ్యూల్ డేవిస్ యూకే రహస్య నిఘా సంస్థల కోసం పనిచేస్తున్నాడని గుర్తించింది. ఈ కేసులో, రష్యా ప్రభుత్వం ఆయనకు రెండు వారాల్లోగా దేశాన్ని వదిలి వెళ్ళమని సమన్లు జారీ చేసింది. రష్యా భూభాగంలో ఉన్న వ్యక్తి దేశీయ భద్రతా సంబంధిత సమాచారాన్ని విదేశీ నిఘా సంస్థలకు పంపితే తమ ప్రభుత్వం దానిని ఎప్పుడూ సహించదని రష్యన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ స్పష్టంగా హెచ్చరించింది.

వివరాలు 

2025లో మాస్కో ఇద్దరు బ్రిటన్ దౌత్యవేత్తలనుబహిష్కరించింది

అంతేకాక, యూకే ప్రభుత్వం ఈ ఘటనను తీవ్రతరం చేయడానికి ప్రయత్నిస్తే, రష్యా ప్రతీకార చర్యలకు కూడా వెనుకాడదని వెల్లడించింది. ప్రస్తుతం లండన్-మాస్కో మధ్య స్నేహపూర్వక సంబంధాలను దృష్టిలో ఉంచుకుని, సదరు దౌత్యవేత్తపై ఎలాంటి అదనపు చర్యలు తీసుకోకుండా కేవలం దేశం నుంచి బహిష్కరిస్తున్నట్లు తెలిపింది గమనించదగ్గది ఏమంటే, 2025లోనూ ఇదే విధంగా గూఢచర్య ఆరోపణల కారణంగా మాస్కో ఇద్దరు బ్రిటన్ దౌత్యవేత్తలను దేశం నుంచి బహిష్కరించింది.

Advertisement