Loading...
Putin: ఐరోపా దేశాలకు రష్యా ఎప్పుడూ ముప్పు కాదు : పుతిన్
ఐరోపా దేశాలకు రష్యా ఎప్పుడూ ముప్పు కాదు : పుతిన్

Putin: ఐరోపా దేశాలకు రష్యా ఎప్పుడూ ముప్పు కాదు : పుతిన్

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 12, 2026
11:58 am

ఈ వార్తాకథనం ఏంటి

బ్రిక్స్ సదస్సు 2026 (BRICS) సందర్భంగా రష్యా అధ్యక్షుడు పుతిన్ (Putin) శనివారం మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. రష్యా ఎప్పుడూ ఐరోపా దేశాలను (European countries) బెదిరించలేదని.. భవిష్యత్తులోనూ అలా చేయబోదని స్పష్టం చేశారు. అయితే తమ దేశ ప్రయోజనాలకు, అంతర్జాతీయ చట్టాలకు విరుద్ధంగా ఎవరైనా వ్యవహరిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. నాటో విస్తరణ, ఐరోపా దేశాల జోక్యం కారణంగానే ఉక్రెయిన్‌తో యుద్ధం (Russia-Ukraine) కొనసాగుతోందని ఆయన వ్యాఖ్యానించారు. ''ఐరోపా దేశాలను బెదిరించాలని మేం ఎందుకు అనుకుంటాం? రెండో ప్రపంచ యుద్ధం తర్వాత అన్ని సమస్యలు పరిష్కారమయ్యాయి. ఆ తర్వాత జరిగిన పరిణామాలన్నీ రష్యన్ ఫెడరేషన్ సమ్మతితోనే జరిగాయి.

వివరాలు

వారి వల్లే యుద్ధం కొనసాగుతోంది

కానీ ఇప్పుడు ఐరోపా దేశాల నేతలు ఉక్రెయిన్‌లోకి మరింత మంది సైన్యాన్ని పంపించేందుకు చర్చలు జరుపుతున్నారు.

అంటే వారు మాతో యుద్ధాన్ని కోరుకుంటున్నారు. వారి వల్లే యుద్ధం కొనసాగుతోందని పుతిన్ పేర్కొన్నారు.

ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల్లో ప్రపంచ దేశాల ఇంధన, ఆహార భద్రతకు సహకరించేందుకు రష్యా సిద్ధంగా ఉందని ఆయన తెలిపారు.

అంతేకాకుండా పర్యాటకం, పరిశ్రమలు, వాణిజ్యం వంటి రంగాల్లో ఆసక్తికర కార్యక్రమాలకు రష్యా తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయని చెప్పారు.

వివరాలు

ప్రపంచంతో కలిసి పనిచేయడానికి సిద్ధం

బ్రిక్స్‌లోని అన్ని దేశాలకు చైతన్యవంతమైన, శక్తిమంతమైన దేశీయ మార్కెట్లు ఉన్నాయని పుతిన్ పేర్కొన్నారు. బ్రిక్స్ (BRICS) కూటమి ఎవరికీ వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు.

అదే సమయంలో యావత్ ప్రపంచంతో కలిసి పనిచేయడానికి మాస్కో సిద్ధంగా ఉందన్నారు.

భారత్‌తో ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని రష్యా అధ్యక్షుడు పుతిన్ తెలిపారు.

ADVERTISEMENT