Russia-Ukraine: ఉక్రెయిన్‌పై రష్యా భీకర దాడులు.. 27 మంది మృతి, 50 భవనాలు ధ్వంసం
వ్రాసిన వారు
Jayachandra Akuri
Aug 29, 2026
03:15 pm
ఈ వార్తాకథనం ఏంటి
రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం మరోసారి తీవ్రరూపం దాల్చింది. గత నాలుగేళ్లుగా కొనసాగుతున్న ఈ యుద్ధంలో ఇప్పటికే వందలాది మంది ప్రాణాలు కోల్పోగా.. ఇరుదేశాల్లో భారీగా ఆస్తి నష్టం జరిగింది. తాజాగా మరోసారి తీవ్ర విషాద ఘటన చోటుచేసుకుంది. ఉక్రెయిన్ రాజధాని కీవ్‌పై రష్యా దాడులు చేసినట్లు సమాచారం. ఈ దాడుల్లో ఇప్పటివరకు 27 మంది ప్రాణాలు కోల్పోయారు. మరోవైపు సుమారు 50 నివాస భవనాలు దెబ్బతిన్నట్లు తెలుస్తోంది. దాడుల నేపథ్యంలో కీవ్‌లో తీవ్ర ఆందోళన నెలకొంది. ఈ ఘటనలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. అయితే దాడులకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.