LOADING...
Russia-Ukraine:  కీవ్‌పై భారీ దాడుల హెచ్చరిక.. విదేశీయులు నగరం విడిచిపోవాలని రష్యా సూచన
కీవ్‌పై భారీ దాడుల హెచ్చరిక.. విదేశీయులు నగరం విడిచిపోవాలని రష్యా సూచన

Russia-Ukraine:  కీవ్‌పై భారీ దాడుల హెచ్చరిక.. విదేశీయులు నగరం విడిచిపోవాలని రష్యా సూచన

వ్రాసిన వారు Sirish Praharaju
May 26, 2026
10:47 am

ఈ వార్తాకథనం ఏంటి

రష్యా-ఉక్రెయిన్ మధ్య కొనసాగుతున్న యుద్ధం మరింత ఉద్రిక్తంగా మారుతోంది. గత నాలుగేళ్లుగా సాగుతున్న ఈ ఘర్షణలో తాజాగా రష్యా మరోసారి ఉక్రెయిన్‌పై భారీ స్థాయిలో దాడులకు సిద్ధమవుతున్నట్లు సంకేతాలు ఇచ్చింది. ఇటీవల అత్యంత శక్తివంతమైన 'ఒరెష్నిక్‌' హైపర్‌ సోనిక్‌ బాలిస్టిక్‌ క్షిపణితో పాటు అనేక క్షిపణులు, వందల సంఖ్యలో డ్రోన్లతో రష్యా దాడులు జరిపింది. ఇక ముందు రాజధాని కీవ్‌పై మరింత తీవ్ర దాడులు జరిగే అవకాశముందని హెచ్చరించింది. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీకి సంబంధించిన విధాన నిర్ణయ కేంద్రాలు, రక్షణ రంగ పరిశ్రమలు, కమాండ్‌ కేంద్రాలు, డ్రోన్ తయారీ యూనిట్లను లక్ష్యంగా చేసుకుని దాడులు పెంచుతామని రష్యా ప్రకటించింది.

వివరాలు 

ఫోన్‌లో మాట్లాడుకున్నసెర్గీ లావ్రోవ్‌, మార్కో రూబియో

ఈ నేపథ్యంలో కీవ్‌లో ఉన్న విదేశీ దౌత్యవేత్తలు, అంతర్జాతీయ సంస్థల సిబ్బంది,విదేశీయులు వెంటనే నగరాన్ని వీడాలని రష్యా విదేశాంగ శాఖ సూచించింది. అలాగే సైనిక, పరిపాలనా భవనాల పరిసరాలకు సాధారణ ప్రజలు దూరంగా ఉండాలని హెచ్చరిక జారీ చేసింది. ఇదే విషయంపై రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్‌, అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో సోమవారం ఫోన్‌లో మాట్లాడుకున్నారు.

వివరాలు 

కీవ్‌పై భారీ దాడులు చేస్తాం: పుతిన్ ప్రభుత్వం

రాబోయే రోజుల్లో మరిన్ని దాడులు జరిగే అవకాశం ఉన్నందున కీవ్‌లోని అమెరికా దౌత్య సిబ్బందిని తరలించాలని లావ్రోవ్‌ సూచించినట్లు సమాచారం. అయితే ఇలాంటి హెచ్చరికలు రష్యా నుంచి రావడం ఇదే మొదటిసారి కాదు. గతంలో మే నెలలో జరిగిన రెడ్‌ స్క్వేర్‌ సైనిక విన్యాసాలకు ఎలాంటి ఆటంకం కలిగించినా కీవ్‌పై భారీ దాడులు చేస్తామని పుతిన్ ప్రభుత్వం హెచ్చరించింది. కానీ ఇలాంటి బెదిరింపులకు తాము భయపడబోమని ఉక్రెయిన్ ప్రభుత్వం స్పష్టం చేస్తూ వస్తోంది.

Advertisement