LOADING...
Russia-Ukraine War: రష్యా డ్రోన్‌ దాడిలో ఉక్రెయిన్ అతిపెద్ద నిఘా నౌక ధ్వంసం.. VIDEO
రష్యా డ్రోన్‌ దాడిలో ఉక్రెయిన్ అతిపెద్ద నిఘా నౌక ధ్వంసం.. VIDEO

Russia-Ukraine War: రష్యా డ్రోన్‌ దాడిలో ఉక్రెయిన్ అతిపెద్ద నిఘా నౌక ధ్వంసం.. VIDEO

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 29, 2025
11:03 am

ఈ వార్తాకథనం ఏంటి

ఉక్రెయిన్‌, రష్యా మధ్య యుద్ధాన్ని ఆపడానికి చర్చలు జరగుతున్నప్పటికీ, రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు రోజురోజుకు మరింత తీవ్రంగా మారుతున్నాయి. తాజాగా మాస్కో కీవ్‌పై మరోసారి దాడి జరిపింది. రష్యా సముద్ర డ్రోన్లను ఉపయోగించి ఉక్రెయిన్‌కు చెందిన అతిపెద్ద నౌకను ధ్వంసం చేయగా, అది మునిగిపోయింది. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఉక్రెయిన్‌లోని ఒడెస్సా ప్రాంతంలోని దనుబె నదిలో నిఘా నౌక సింఫెరోపోల్ మోహరించబడిన సమయంలో రష్యా దానిపై దాడి చేసింది. రష్యా సముద్ర డ్రోన్‌లను ఉపయోగించింది. ఈ దాడి కారణంగా నౌక భారీగా ధ్వంసమై నీటిలో మునిగినట్లు రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది.

వివరాలు 

2014 తరువాత కీవ్ మోహరించిన అతిపెద్ద నౌక

ఉక్రెయిన్‌ ప్రభుత్వం కూడా ఈ ఘటనను ధృవీకరించింది. ఈ దాడిలో నౌకలో ఒక సిబ్బంది మరణించగా, మరికొందరు గాయపడ్డారు. సముద్రంలో గల్లంతైన కొంతమంది నావికుల కోసం గాలిస్తున్నట్లు పేర్కొంది. సింఫెరోపోల్‌ను 2019లో ఆవిష్కరించి, రెండు సంవత్సరాల తరువాత ఉక్రెయిన్ నౌకాదళంలో చేర్చారు. 2014 తరువాత కీవ్ మోహరించిన అతిపెద్ద నౌక ఇదే. ఇక రష్యా-ఉక్రెయిన్ మధ్య దాడులు పెరుగుతూ ఉన్నాయి. బుధవారం రాత్రి కీవ్ సహా పలు నగరాలపై మాస్కో 598 డ్రోన్లు మరియు 31 క్షిపణులను ప్రయోగించింది. ఈ దాడులలో 17 మంది పౌరులు మృతి చెందగా, 48 మందికి గాయాలయ్యాయి.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

రష్యా డ్రోన్‌ దాడిలో ఉక్రెయిన్ అతిపెద్ద నిఘా నౌక ధ్వంసం