Page Loader
Vladimir Putin: డొనాల్డ్ ట్రంప్ విజయంపై వ్లాదిమిర్ పుతిన్ అభినందనలు.. అమెరికాతో చర్చలపై కీలక వ్యాఖ్యలు
అమెరికాతో చర్చలపై కీలక వ్యాఖ్యలు

Vladimir Putin: డొనాల్డ్ ట్రంప్ విజయంపై వ్లాదిమిర్ పుతిన్ అభినందనలు.. అమెరికాతో చర్చలపై కీలక వ్యాఖ్యలు

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 08, 2024
10:17 am

ఈ వార్తాకథనం ఏంటి

రిపబ్లికన్ పార్టీ తరఫున అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన డొనాల్డ్ ట్రంప్‌కు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ శుభాకాంక్షలు తెలిపారు. ట్రంప్‌తో చర్చలు జరిపేందుకు సిద్ధంగా ఉన్నారా? అనే మీడియా ప్రశ్నకు పుతిన్ అవునని సమాధానం ఇచ్చారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత రష్యాలోని సోచిలో గురువారం జరిగిన అంతర్జాతీయ సదస్సులో పుతిన్ పాల్గొన్నారు. ఆ తర్వాత మీడియా సమావేశంలో పుతిన్ మాట్లాడుతూ, అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో చారిత్రాత్మక విజయం సాధించిన ట్రంప్‌కు శుభాకాంక్షలు తెలిపారు.

వివరాలు 

 70 మంది ప్రపంచ నేతలతో మాట్లాడిన ట్రంప్ 

మీడియా ప్రశ్నకు స్పందిస్తూ, ట్రంప్‌తో చర్చలు జరపడానికి తాను సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. అలాగే గత సంవత్సరం జులైలో ట్రంప్‌పై జరిగిన హత్యాయత్నం గురించి కూడా పుతిన్ స్పందించారు. ఆ దాడి అనంతరం ట్రంప్ ప్రదర్శించిన ధైర్యం తనను ఆకట్టుకుందని చెప్పారు. అదే సమయంలో, తన విజయానంతరం ట్రంప్ 70 మంది ప్రపంచ నేతలతో మాట్లాడినట్లు తెలిపారు. పుతిన్ మాత్రం డెమోక్రాటిక్ అభ్యర్థి కమలా హారిస్‌ను గెలిపించాలని పిలుపునిచ్చిన నేపథ్యంలో, పుతిన్‌తో ఇంకా మాట్లాడలేదని ట్రంప్ వెల్లడించారు.