
Same Sex-Iraq Law: స్వలింగ సంపర్కాన్ని నిషేధిస్తూ ఇరాక్ చట్టం...మండిపడ్డ పాశ్చాత్య దేశాలు
ఈ వార్తాకథనం ఏంటి
స్వలింగ సంపర్కాన్ని (Same Sex) నేరంగా పరిగణిస్తూ ఇరాక్ (Iraq)దేశం తాజాగా చట్టం చేసింది.
ఇందుకు సంబంధించిన బిల్లును శనివారం ఇరాక్ పార్లమెంట్లో ఆమోదించారు.
ఈ చట్టం ప్రకారం స్వలింగ సంపర్కం కలిగి ఉన్న వారికి 15 ఏళ్ల పాటు జైలు శిక్ష విధించే అవకాశం ఉంది.
మతపరమైనటువంటి విలువల ఆధారంగా ఇరాక్ పార్లమెంట్ ఈ చట్టాన్ని ఆమోదించింది.
వ్యభిచారంపై కూడా ఇరాక్ కఠిన చర్యలు తీసుకోనున్నట్లు తెలిపింది.
అయితే ఇరాక్ చేసిన తాజా చట్టంపై పాశ్చాత్య దేశాలు మండిపడుతున్నాయి.
అమెరికా(America),యూరోపియన్ యూనియన్ దేశాలు కూడా తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశాయి.
ఇరాక్ చేసిన తాజా చట్టం పై నిరసనలు తీవ్రమవుతాయని ఆందోళన వ్యక్తం చేశాయి.
Iraq-New law
మానవ హక్కులకు, స్వేచ్ఛకు భంగం: పాశ్చాత్య దేశాలు
ఇరాక్ తాజా చట్టంపై అమెరికా యూరోపియన్ యూనియన్ దేశాలు స్పందిస్తూ ...ఈ చట్టం మానవ హక్కు(Human Rights)లకు, ప్రాథమిక స్వేచ్ఛ (Primary Liberty)లకు ముప్పుగా పరిణమిస్తుందని పేర్కొన్నాయి.
గత కొంతకాలంగా లెస్బియన్ కమ్యూనిటీ (LGBTI) సభ్యులపై ఇరాక్ చట్టబద్ధమైన చర్యలను తీసుకుంటుందని ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ అశోకుడు రాజీవ్ సాలిహి తెలిపారు.
ఇరాక్ చేసిన తాజా చట్టాన్ని హ్యూమన్ రైట్స్ వాచ్ సభ్యుడు సారా సంబర్ తీవ్రంగా విమర్శించారు .