Loading...
Sardinia: కుటుంబ సభ్యుల మధ్య మాటలు పెంచేందుకు రెస్టారెంట్లలో కొత్త నిబంధన.. ఎక్కడంటే?
కుటుంబ సభ్యుల మధ్య మాటలు పెంచేందుకు రెస్టారెంట్లలో కొత్త నిబంధన.. ఎక్కడంటే?

Sardinia: కుటుంబ సభ్యుల మధ్య మాటలు పెంచేందుకు రెస్టారెంట్లలో కొత్త నిబంధన.. ఎక్కడంటే?

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 28, 2026
03:42 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఇటలీకి చెందిన సార్డీనియా ద్వీపంలోని కొన్ని రెస్టారెంట్లు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టాయి. భోజనం చేసేటప్పుడు కుటుంబ సభ్యులు స్మార్ట్‌ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను పక్కన పెట్టాలని నిర్ణయించాయి. పిల్లల్లో ఫోన్ వాడకాన్ని తగ్గించడంతోపాటు కుటుంబ సభ్యుల మధ్య సంభాషణలు పెంచడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. 'ఎ తవోలా సెన్జా స్కెర్మీ' (తెరలు లేకుండా భోజనం) పేరుతో చేపట్టిన ఈ కార్యక్రమంలో వచ్చే వారం నుంచి నెల రోజుల పాటు 15 రెస్టారెంట్లు పాల్గొననున్నాయి.

వివరాలు 

కుటుంబ సభ్యుల మధ్య సంభాషణలే లక్ష్యం

సార్డీనియా పిల్లల హక్కుల పరిరక్షణ విభాగం ప్రతినిధి అన్నా కావు ఈ కార్యక్రమాన్ని ముందుండి నడిపిస్తున్నారు.

పిల్లలు డిజిటల్ పరికరాలకు అతిగా అలవాటు పడకుండా చూడటం, భోజనం చేసే సమయంలో తల్లిదండ్రులతో మాట్లాడేలా ప్రోత్సహించడం దీని ప్రధాన లక్ష్యం.

ఇందులో భాగంగా రెస్టారెంట్లకు వచ్చే తల్లిదండ్రులు, పిల్లలు తమ ఫోన్లను పక్కన పెట్టాల్సి ఉంటుంది.

"కేవలం ఆంక్షలు పెట్టడం, తల్లిదండ్రులపైనే బాధ్యత వేయడం కాకుండా.. కుటుంబ సభ్యులు కలిసి సమయం గడిపేలా అనువైన వాతావరణాన్ని కల్పించడమే ఈ కార్యక్రమం ఉద్దేశం" అని అన్నా కావు తెలిపారు

వివరాలు 

ఫోన్లకు బదులుగా ఆటలు, బొమ్మలతో ప్రత్యేక కిట్

కుటుంబ సభ్యులు ఫోన్లను పక్కన పెట్టిన తర్వాత రెస్టారెంట్ సిబ్బంది వారికి ప్రత్యేకమైన 'రీయూనియన్ కిట్‌'ను అందిస్తారు.

ఇందులో ఆటలు, బొమ్మలు గీసేందుకు అవసరమైన సామగ్రి ఉంటాయి. ఇటలీ పీడియాట్రిషియన్ల సమాఖ్య ఈ కిట్‌ను రూపొందించింది.

పిల్లలు తమ రోజువారీ అనుభవాలను తల్లిదండ్రులతో పంచుకోవడం, ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం వంటి అలవాట్లను పెంపొందించేందుకు ఇవి ఉపయోగపడతాయి.

డిజిటల్ పరికరాలను అతిగా ఉపయోగించడం వల్ల కలిగే నష్టాలు, ఇంట్లో సోషల్ మీడియా వాడకాన్ని ఎలా నియంత్రించుకోవాలనే సూచనలతో కూడిన పుస్తకాన్ని కూడా ఈ కిట్‌లో చేర్చారు.

అయితే, భోజనం చేసే సమయంలో కుటుంబ సభ్యులు కొద్దిసేపు ఆటల్లో పాల్గొనేలా ఈ కార్యక్రమాన్ని రూపొందించినట్లు అన్నా నిర్వాహకులు తెలిపారు.

ADVERTISEMENT

వివరాలు 

కుటుంబ బంధాలను పెంచేందుకు రెస్టారెంట్ల కొత్త ప్రయత్నం

ఈ కార్యక్రమాన్ని సార్డీనియాలోని ఫిపే-కాన్ఫ్‌కామెర్సియో సంస్థ సహకారంతో చేపట్టారు.

ద్వీపంలోని ఆ సంస్థ అధ్యక్షుడు ఇమాన్యుయెల్ ఫ్రోంజియా మాట్లాడుతూ.. 15 రెస్టారెంట్లు స్వచ్ఛందంగా పాల్గొనేందుకు ముందుకొచ్చాయని తెలిపారు.

భవిష్యత్తులో ఈ కార్యక్రమాన్ని మరిన్ని రెస్టారెంట్లకు విస్తరించాలని భావిస్తున్నట్లు చెప్పారు.

కుటుంబంతో కలిసి భోజనం చేసే సమయంలో గతంలో కనిపించిన సందడి, మాటలు తగ్గిపోయి.. ఫోన్లు చూస్తూ మౌనంగా గడిపే పరిస్థితి పెరుగుతోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

పిల్లలు ప్రశాంతంగా ఉండాలనే ఉద్దేశంతో తల్లిదండ్రులు వారికి ఫోన్లు ఇస్తున్నారని ఆయన అన్నారు.

ADVERTISEMENT