Loading...
Saudi Arabia: గ్రాండ్ మసీదులో బాంబర్ వార్తలు అవాస్తవం.. సౌదీ అరేబియా ప్రకటన
గ్రాండ్ మసీదులో బాంబర్ వార్తలు అవాస్తవం.. సౌదీ అరేబియా ప్రకటన

Saudi Arabia: గ్రాండ్ మసీదులో బాంబర్ వార్తలు అవాస్తవం.. సౌదీ అరేబియా ప్రకటన

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 02, 2026
02:46 pm

ఈ వార్తాకథనం ఏంటి

సౌదీ అరేబియాలోని మక్కా గ్రాండ్ మసీదులో ఆత్మాహుతి బాంబర్ ఉన్నట్లు వచ్చిన వార్తలను ఆ దేశ అధికారులు శుక్రవారం ఖండించారు. గ్రాండ్ మసీదు వద్ద ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్న మాట వాస్తవమేనని, అయితే అతడు బాటసారులను ఇబ్బంది పెడుతూ భయాందోళనలు సృష్టించడంతోనే భద్రతా సిబ్బంది అతడిని అరెస్టు చేసినట్లు వెల్లడించారు. పవిత్ర నగరంలో బాటసారులను ఇబ్బంది పెట్టి, వారిలో భయం,ఆందోళన కలిగించిన ఓ వ్యక్తిని భద్రతా అధికారులు అదుపులోకి తీసుకున్నారని సౌదీ అధికారులు 'ఎక్స్‌' వేదికగా ఒక ప్రకటనలో తెలిపారు. అతడిపై వెంటనే చర్యలు తీసుకున్నట్లు పేర్కొన్నారు. అయితే, ఈ ఘటనకు సంబంధించి సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్న ఇతర కథనాల్లో ఎలాంటి నిజం లేదని భద్రతా అధికారులు స్పష్టం చేశారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

మక్కాలో బాంబర్ కలకలం అంటూ సోషల్ మీడియాలో ప్రచారం

వివరాలు 

సోషల్ మీడియాలో పోస్టులు వైరల్

అదుపులోకి తీసుకున్న వ్యక్తికి సంబంధించిన మరిన్ని వివరాలను అధికారులు వెల్లడించలేదు.

అంతకుముందు సోషల్ మీడియాలో కొన్ని పోస్టులు వైరల్ అయ్యాయి.

పేలుడు పదార్థాలతో కూడిన జాకెట్ ధరించిన ఓ అనుమానిత ఆత్మాహుతి బాంబర్ మక్కాలోని గ్రాండ్ మసీదుకు చేరుకుని, కాబా వైపు వెళ్లేందుకు ప్రయత్నించాడని అందులో పేర్కొన్నారు.

అయితే ఈ ప్రచారాన్ని సౌదీ అధికారులు పూర్తిగా ఖండించారు.

ఇస్లాం మతంలో అత్యంత పవిత్రమైన ప్రార్థనా స్థలంగా భావించే గ్రాండ్ మసీదు మధ్యలో కాబా ఉంటుంది.

ఇది ఘనాకారంలో ఉండే నిర్మాణం. ప్రతి ఏడాది ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ముస్లింలు కాబాను దర్శించేందుకు మక్కాకు వెళ్తుంటారు.

ADVERTISEMENT