Loading...
Riyadh airport attack: రియాద్‌ విమానాశ్రయంపై దాడి.. మరో భారతీయుడు మృతి
రియాద్‌ విమానాశ్రయంపై దాడి.. మరో భారతీయుడు మృతి

Riyadh airport attack: రియాద్‌ విమానాశ్రయంపై దాడి.. మరో భారతీయుడు మృతి

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 04, 2026
02:39 pm

ఈ వార్తాకథనం ఏంటి

సౌదీ అరేబియా రాజధాని రియాద్‌లోని అంతర్జాతీయ విమానాశ్రయంపై అక్టోబరు 10న హూతీలు జరిపిన దాడిలో తీవ్రంగా గాయపడిన మరో భారతీయుడు చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషయాన్ని సౌదీ అరేబియాలోని భారత రాయబార కార్యాలయం వెల్లడించింది. మృతుడి కుటుంబ సభ్యులతో సంప్రదింపులు జరుపుతున్నామని,ఆయన మృతదేహాన్ని త్వరగా స్వదేశానికి తరలించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నామని 'ఎక్స్‌' వేదికగా తెలిపింది. అయితే మృతుడి పేరు,ఇతర వివరాలను మాత్రం వెల్లడించలేదు. కాగా, ఇదే దాడిలో మరణించిన మరో భారతీయుడిని హైదరాబాద్‌లోని మెహదీపట్నంకు చెందిన మహమ్మద్‌ యూసఫ్‌ అలీగా గుర్తించారు. ఆయన అంత్యక్రియలు అక్టోబరు 12న రియాద్‌లో నిర్వహించారు. ఈ దాడిలో 300 మందికి పైగా గాయపడగా.. వారిలో 10 మంది భారతీయులు ఉన్నట్లు అధికారులు తెలిపారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

సౌదీ అరేబియాలోని భారత రాయబార కార్యాలయం చేసిన ట్వీట్ 

ADVERTISEMENT