LOADING...
16 Epstein files Missing: ఎప్‌స్టీన్‌ కుంభకోణంలో సంచలనం.. ట్రంప్‌ ఫొటో ఉన్న 16 ఫైళ్లు మాయం! 
ఎప్‌స్టీన్‌ కుంభకోణంలో సంచలనం.. ట్రంప్‌ ఫొటో ఉన్న 16 ఫైళ్లు మాయం!

16 Epstein files Missing: ఎప్‌స్టీన్‌ కుంభకోణంలో సంచలనం.. ట్రంప్‌ ఫొటో ఉన్న 16 ఫైళ్లు మాయం! 

వ్రాసిన వారు Jayachandra Akuri
Dec 21, 2025
09:27 am

ఈ వార్తాకథనం ఏంటి

ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపిన ఎప్‌స్టీన్‌ సెక్స్‌ కుంభకోణంకు సంబంధించిన పత్రాలను అమెరికా న్యాయశాఖ విడుదల చేస్తుండటం తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసుకు సంబంధించిన దాదాపు 16 ఫైళ్లు మాయమైనట్లు వెలుగులోకి వచ్చింది. (16 Epstein files Missing). అమెరికా న్యాయశాఖ అధికారిక వెబ్‌పేజీ నుంచి ఈ ఫైళ్లు అదృశ్యమైనట్లు గుర్తించారు. ముఖ్యంగా ఈ మాయమైన ఫైళ్లలో అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఫొటో కూడా ఉన్నట్లు సమాచారం. దీంతో ఈ వ్యవహారం రాజకీయ, న్యాయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఎప్‌స్టీన్‌కు సంబంధించిన పలు కీలక పత్రాలను అమెరికా న్యాయశాఖ శుక్రవారం (అమెరికా కాలమానం ప్రకారం) విడుదల చేసింది.

Details

 468 నంబర్‌ కలిగిన డాక్యుమెంట్లు ఉన్నట్లు తెలుస్తోంది

ఈ పత్రాల్లో మాజీ అధ్యక్షుడు బిల్‌ క్లింటన్‌, పాప్‌ స్టార్‌ మైఖేల్‌ జాక్సన్‌ వంటి ప్రముఖుల ఫొటోలు కూడా ఉన్నాయి. అయితే ఈ ఫైళ్లు విడుదలైన కొన్ని గంటల్లోనే, వాటిలో కొన్ని ఫైళ్లు అకస్మాత్తుగా మాయమవడం సంచలనంగా మారింది. మాయమైన ఫైళ్లలో 468 నంబర్‌ కలిగిన డాక్యుమెంట్లు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. వీటిలో డొనాల్డ్‌ ట్రంప్‌, ఆయన భార్య మెలానియా ట్రంప్‌, జెఫ్రీ ఎప్‌స్టీన్‌, అలాగే అతడి సన్నిహితురాలు గిస్లైన్‌ మాక్స్‌వెల్‌ ఫొటోలు ఉన్నట్లు సమాచారం.

Details

పలు సున్నితమైన అంశాలు ఉన్నట్లు సమాచారం

అంతేకాకుండా బాధితుల నుంచి ఎఫ్‌బీఐ నమోదు చేసిన వాంగ్మూలాలు, అంతర్గత న్యాయశాఖకు సంబంధించిన మెమోలు, కేసుకు సంబంధించిన పలు సున్నితమైన అంశాలు కూడా ఈ ఫైళ్లలో ఉన్నాయని తెలుస్తోంది. ఈ ఫైళ్లను ఉద్దేశపూర్వకంగానే తొలగించారా? లేక అనుకోకుండా జరిగిందా? అనే విషయంపై అమెరికా న్యాయశాఖ ఇప్పటివరకు స్పష్టత ఇవ్వలేదు. ఈ అంశంపై ఎలాంటి అధికారిక ప్రకటన కూడా విడుదల కాలేదు. అయితే ఫైళ్లు అదృశ్యమవడంపై నెట్టింట తీవ్ర చర్చ మొదలైంది.

Advertisement