Nijjar Killing: నిజ్జర్ హత్యపై సంచలన ట్విస్ట్.. 'మేమే చంపాం' అన్న గోల్డీ బ్రార్?
ఈ వార్తాకథనం ఏంటి
ఖలిస్తానీ ఉగ్రవాది హర్డీప్ సింగ్ నిజ్జర్ 2023లో కెనడాలోని సర్రే ప్రాంతంలో ఓ గురుద్వారా ముందు హత్యకు గురయ్యాడు. ఈ ఘటన భారత్-కెనడా మధ్య తీవ్ర దౌత్య వివాదానికి దారితీసింది. నిజ్జర్ హత్యలో భారత ప్రభుత్వ ప్రమేయం ఉందని అప్పటి కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఆరోపించారు. అయితే భారత్ ఈ ఆరోపణలను తీవ్రంగా ఖండించింది. ఈ పరిణామాల నేపథ్యంలో ఇరు దేశాలు తమ దౌత్యవేత్తల సంఖ్యను తగ్గించుకోవడంతో ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. అయితే కొత్తగా కెనడా ప్రధానిగా మార్క్ కార్నీ బాధ్యతలు చేపట్టిన తర్వాత భారత్-కెనడా సంబంధాలు క్రమంగా మళ్లీ మెరుగుపడుతున్నాయి. ఇదిలా ఉండగా.. నిజ్జర్ హత్యకు సంబంధించి తాజాగా ఓ కీలక పరిణామం వెలుగులోకి వచ్చింది.
వివరాలు
సంచలనంగా మారిన ఆడియో టేప్
తామే నిజ్జర్‌ను హత్య చేశామని గ్యాంగ్‌స్టర్ గోల్డీ బ్రార్ చెప్పినట్లు వెల్లడవుతున్న ఓ లీకైన ఆడియో టేప్ సంచలనంగా మారింది.
యూకేకు చెందిన ఖలిస్తానీ ఉగ్రవాది పరమ్‌జిత్ సింగ్ పమ్మాతో బ్రార్ మాట్లాడిన సమయంలో ఈ వ్యాఖ్యలు చేసినట్లు పలు నివేదికలు పేర్కొంటున్నాయి.
ఈ సంభాషణలో నిజ్జర్‌పై బ్రార్ పలు ఆరోపణలు చేసినట్లు తెలుస్తోంది.
డ్రగ్స్ విక్రయాల కోసం 16-17 ఏళ్ల యువకులను ఉపయోగించేందుకు నిజ్జర్ మద్దతు ఇచ్చేవాడని, డ్రగ్స్ విక్రయించేందుకు యువకులను బ్లాక్‌మెయిల్ చేసేవాడని బ్రార్ ఆరోపించినట్లు సమాచారం.
అంతేకాకుండా వారిని ఇన్‌ఫార్మర్లుగా కూడా ఉపయోగించేవాడని పేర్కొన్నట్లు తెలుస్తోంది. ఇ
వివరాలు
అధికారికంగా నిర్ధారణ కాలేదు
దే సమయంలో నిజ్జర్ అక్రమ ఆయుధాల వ్యాపారంలోనూ పాల్గొనేవాడని బ్రార్ ఆరోపించినట్లు నివేదికలు చెబుతున్నాయి.
ఈ కారణాలతోనే నిజ్జర్‌ను హత్య చేసినట్లు ఆ ఆడియోలో బ్రార్ చెప్పినట్లు సమాచారం.
అయితే ఈ లీకైన ఆడియో టేప్ ప్రామాణికత, అందులోని వ్యాఖ్యలపై అధికారికంగా పూర్తి నిర్ధారణ రావాల్సి ఉంది.