Air Europa: ఎయిర్ యూరోపా విమానంలో కుదుపులు.. డజన్ల కొద్దీ గాయాలు.. బ్రెజిల్‌కు మళ్లింపు
మాడ్రిడ్ నుండి మాంటెవీడియోకి వెళ్లే ఎయిర్ యూరోపా విమానం తీవ్రమైన కుదుపులకు గురైంది. దీని కారణంగా బ్రెజిలియన్ విమానాశ్రయంలో అత్యవసర ల్యాండింగ్ చేయవలసి వచ్చిందని ఎయిర్‌లైన్స్ తెలిపింది. సోమవారం తెల్లవారుజామున విమానాన్ని దారి మళ్లించారు. తర్వాత దాదాపు 40 మంది ప్రయాణికులు, ఎక్కువగా స్వల్ప గాయాల పాలయ్యారు. దీనితో వారందరినీ రియో గ్రాండే డో నార్టే రాష్ట్ర రాజధాని నాటల్‌లోని ఆసుపత్రులకు తరలించారు.
ఉరుగ్వే రాజధాని మాంటెవీడియోకు వెళ్లే విమానంలో కుదుపులు
న్యూస్ వెబ్‌సైట్ G1, కొంతమంది ప్రయాణీకులకు గాయాలయ్యాయని తెలిపింది. కుదుపుల సమయంలో వారి తలలకు కొట్టుకున్నారని పేర్కొంది. బోయింగ్ 787-9 డ్రీమ్‌లైనర్ 325 మంది వ్యక్తులతో ఆదివారం రాత్రి 11.57 గంటలకు మాడ్రిడ్ నుండి బయలుదేరింది . ఉరుగ్వే రాజధాని మాంటెవీడియోకు సోమవారం తెల్లవారుజామున చేరుకోవాల్సి ఉంది. తెల్లవారుజామున 2.32 గంటలకు, ఫ్లైట్ UX045 ఈశాన్య బ్రెజిల్‌లోని నాటల్ విమానాశ్రయంలో అత్యవసర ల్యాండింగ్‌ను కోరింది. స్పెయిన్, ఉరుగ్వే, ఇజ్రాయెల్, జర్మనీ , బొలీవియా నుండి 40 మంది ప్రయాణికులు ప్రభుత్వ ఆసుపత్రులలో చికిత్స పొందారు. వీరిలో చాలా మందికి వైద్యసేవలందించి డిశ్చార్జి చేశారని రాష్ట్ర ప్రజారోగ్య విభాగం తెలిపింది..