US: అమెరికాలో కాల్పుల కలకలం.. రెస్టారెంట్‌లో ముగ్గురు మృతి
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికాలోని ఇడాహో రాష్ట్రం పశ్చిమ ప్రాంతంలో ఉన్న ట్విన్ ఫాల్స్ నగరంలో ఆదివారం ఘోర కాల్పుల ఘటన చోటుచేసుకుంది. 'ఇన్-ఎన్-అవుట్ బర్గర్' రెస్టారెంట్‌లోకి దుండగుడు చొరబడి విచక్షణారహితంగా కాల్పులు జరపడంతో పలువురు ప్రాణాలు కోల్పోయారు. ఘటన అనంతరం నిందితుడు కూడా మరణించినట్లు పోలీసులు వెల్లడించారు. ట్విన్ ఫాల్స్ నగర ప్రతినిధి జోష్ పాల్మర్ తెలిపిన వివరాల ప్రకారం ఈ కాల్పుల్లో ముగ్గురు మృతి చెందగా, ఇద్దరు గాయపడ్డారు. అయితే మృతుల్లో దుండగుడు కూడా ఉన్నాడా లేదా అన్న విషయంపై ఇంకా స్పష్టత రాలేదని ఆయన తెలిపారు.
వివరాలు
56 వేల మంది జనాభా కలిగిన ప్రాంతం
స్థానిక మీడియా ప్రసారం చేసిన వీడియోల్లో ఓ యువకుడు రెస్టారెంట్ వెలుపల లాంగ్ గన్ పట్టుకుని కనిపించాడు.
అలాగే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న దృశ్యాల్లో కాల్పులు ప్రారంభం కావడంతో భయాందోళనలకు గురైన ప్రజలు రెస్టారెంట్ నుంచి పరుగులు తీస్తూ బయటకు వస్తున్నట్లు కనిపించింది.
ట్విన్ ఫాల్స్ నగరం ఇడాహో దక్షిణ ప్రాంతంలో సుమారు 56 వేల మంది జనాభా కలిగిన ప్రాంతం. ఇది సాల్ట్ లేక్ సిటీకి వాయువ్యంగా సుమారు 290 కిలోమీటర్ల దూరంలో ఉంది.
ప్రస్తుతం ఈ కాల్పుల ఘటనకు గల కారణాలపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.