Page Loader
Hamas Sinwar: రెండుసార్లు ఇజ్రాయెల్ సైన్యం నుంచి తృటిలో తప్పించుకున్న హమాస్ చీఫ్ సిన్వార్‌ 
Hamas Sinwar: రెండుసార్లు ఇజ్రాయెల్ సైన్యం నుంచి తృతిలో తప్పించుకున్న హమాస్ చీఫ్ సిన్వార్‌

Hamas Sinwar: రెండుసార్లు ఇజ్రాయెల్ సైన్యం నుంచి తృటిలో తప్పించుకున్న హమాస్ చీఫ్ సిన్వార్‌ 

వ్రాసిన వారు Stalin
Dec 20, 2023
05:04 pm

ఈ వార్తాకథనం ఏంటి

హమాస్‌ నిర్మూలనే లక్ష్యంగా గాజా స్ట్రిప్‌లో ఇజ్రాయెల్ సైన్యం 'ఐడీఎఫ్' ఆపరేషన్ చేపడుతోంది. హమాస్ చీఫ్ యాహ్యా సిన్వార్‌ కోసం ఇజ్రాయెల్ గాజాను జల్లెడ పడుతోంది. సిన్వార్‌ ఇటీవల ఇజ్రాయెల్ దళాలు నుంచి తృటిలో రెండుసార్లు తప్పించుకున్నట్లు ఆ దేశ మీడియా పేర్కొంది. గాజాలోని సొరంగాల్లో ఇజ్రాయెల్ సైనికులు గాలిస్తున్న సమయంలో యాహ్యా సిన్వార్‌‌కు అతి చేరువగా వెళ్లినా.. అతను రెప్పపాటులో తప్పించుకున్నట్లు ఇజ్రాయెల్ టైమ్స్ వెల్లడించింది. ఇలా రెండుసార్లు జరిగినట్లు రాసుకొచ్చింది. సిన్వార్‌ ఒకే ప్రదేశంలో ఎక్కువ కాలం ఉండకుండా మరొక ప్రదేశానికి మారుతున్న నేపథ్యంలో అతన్ని పట్టుకోవడం ఇజ్రాయెల్ సైన్యానికి సవాల్‌గా మారింది. సిన్వార్ 2017నుంచి గాజాలోని హమాస్ చీఫ్‌గా ఉన్నారు. 2017‌లో అతను ఇస్మాయిల్ హనియా స్థానంలో ఎంపికయ్యాడు.

హమాస్

దక్షిణ గాజాలోనే సిన్వార్‌‌ ఉన్నాడా?

సిన్వార్‌‌ను పట్టుకోవడానికి ఐడీఎఫ్ ప్రధానంగా దక్షిణ గాజా పట్టణం ఖాన్ యూనిస్‌‌తో పాటు చుట్టుపక్కల ఆపరేషన్ ముమ్మరం చేసింది. ఇజ్రాయెల్‌తో యుద్ధం ప్రారంభమైన తర్వాత సిన్వార్ ప్రజల్లోనే దాక్కుని.. దక్షిణం వైపు వచ్చి ప్రస్తుతం ఖాన్ యూనిస్‌లో తలదాచుకున్నట్లు ఐడీఎఫ్ భావిస్తోంది. సిన్వార్ కోసం గాలిస్తున్న సమయంలో ఇజ్రాయెల్ సైనికులు హమాస్ మిలిటరీ వింగ్ కమాండర్ ముహమ్మద్ దీఫ్ రహస్య స్థావరాన్ని కూడా కనుగొన్నారు. డిసెంబర్ 6న ఖాన్ యూనిస్ ప్రాంతంలోని తన ఇంట్లో సిన్వార్ ఉన్నట్లు ఐడీఎఫ్‌కు సమాచారం అందింది. కానీ అక్కడికి వెళ్లి.. సైన్యం వెతకగా.. అక్కడ కనిపించలేదు.