Smart watch : జాగింగ్‌లో హార్ట్ అటాక్.. ప్రాణాలు కాపాడిన స్మార్ట్‌వాచ్
యూకే(united kingdom)కు చెందిన వాఫమ్ హాకీ వేల్స్ అనే కంపెనీకి 42 ఏళ్ల పాల్ సీఈఓగా పనిచేస్తున్నారు. అయితే నిత్యం జాగింగ్‌కు వెళ్లే అలవాటు ఉన్న పాల్, ఓ రోజు ఉదయం 7 గంటలకు జాగింగ్ వెళ్లారు. అక్కడికి చేరిన కొన్ని నిమిషాలకే ఛాతీలో నొప్పి రావడంతో అక్కడే కుప్పకూలిపోయారు. వెంటనే తన చేతికున్న స్మార్ట్ వాచ్ సాయంతో భార్య లారాకు ఫోన్ చేశారు. దీంతో ఐదు నిమిషాల వ్యవధిలోనే ఆమె అక్కడికి చేరుకుంది. తన కారులోనే సమీపంలోని ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడి సిబ్బంది కూడా వేగంగా స్పందించడంతో ఆయన ప్రాణాలు దక్కాయి. ఇలా జాగింగ్‌లో గుండెపోటుకు గురైన ఓ కంపెనీ సీఈఓను స్మార్ట్ వాచ్ కాపాడింది.
గుండె దమనుల్లో అడ్డంకుల వల్లే గుండెపోటు
గుండె దమనుల్లో ఏర్పడిన అడ్డంకుల కారణంగానే గుండెపోటు సంభవించిందని వైద్యులు తెలిపారు. అదే ఆస్పత్రిలో శస్త్ర చికిత్స అనంతరం ఆరు రోజుల తర్వాత పాల్ ఇంటికి క్షేమంగా చేరుకున్నారు. ఈ మేరకు జరిగిన విషయాన్ని విలేకర్లతో పంచుకున్నారు. తాను భారీకాయుడిని కాదని, నిత్యం ఫిట్ గా ఉండేందుకు కృషి చేస్తానని ఆయన చెప్పుకొచ్చారు. అయినా ఇలా జరగడం తనతో పాటు కుటుంబీకులను విస్మయానికి గురి చేసిందన్నారు. గతంలోనూ గుండెపోటు లక్షణాలను స్మార్ట్‌వాచ్‌లు ముందుగానే గుర్తించాయి. ఈ క్రమంలోనే పలువురి ప్రాణాలను కాపడటంలో సహకరించాయి. స్మార్ట్‌వాచ్‌ల్లో ఉండే హార్ట్‌రేట్, ఈసీజీ వంటి సెన్సర్లు గుండెపోటు ముప్పును ముందుగానే గుర్తించడంలో సాయపడుతున్నాయి. సాంకేతికతతో ప్రతికూలతలున్న వాటిని సమస్ఫూర్తిగా, అవసరం మేరకు వినియోగించుకోవడం ఉత్తమం.