Miami: ఇన్‌ఫ్లుయెన్సర్లు ఆండ్రూ, ట్రిస్టన్ అరెస్టు .. మయామీలో అదుపులోకి తీసుకున్న పోలీసులు
ఈ వార్తాకథనం ఏంటి
వివాదాస్పద సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు ఆండ్రూ టేట్,ట్రిస్టన్ టేట్‌లను అమెరికాలోని మయామీలో అధికారులు అదుపులోకి తీసుకున్నారు. మహిళలపై అత్యాచారం, అక్రమ రవాణాకు సంబంధించిన ఆరోపణల నేపథ్యంలో కొనసాగుతున్న అంతర్జాతీయ న్యాయపరమైన వ్యవహారంలో భాగంగా ఈ చర్య తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. 2010 నుంచి 2017 మధ్య జరిగిన ఘటనలకు సంబంధించి వీరిద్దరూ ఇప్పటికే పలు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. రొమేనియా, బ్రిటన్ దేశాలకు సంబంధించిన న్యాయ ప్రక్రియలో భాగంగా శనివారం యూఎస్ మార్షల్ సర్వీస్ టేట్ సోదరులను అరెస్టు చేసినట్లు అధికార వర్గాలు తెలిపాయి. అమెరికా, బ్రిటన్ ద్వంద్వ పౌరసత్వం కలిగిన ఆండ్రూ, ట్రిస్టన్ టేట్‌లు 2016లో రొమేనియాకు వెళ్లారు. అనంతరం లైంగిక నేరాల ఆరోపణలపై 2022లో అక్కడి అధికారులు వారిని అరెస్టు చేశారు.
వివరాలు
వచ్చే వారం వీరిద్దరిని మయామీ ఫెడరల్ కోర్టులో హాజరుపరుస్తాం: అధికారులు
తర్వాత రొమేనియా కోర్టు గత ఏడాది దేశం విడిచి వెళ్లేందుకు అనుమతి ఇవ్వడంతో వారు అమెరికాలోని ఫ్లోరిడాకు చేరుకున్నారు.
ఇదే సమయంలో బ్రిటన్‌లోనూ మహిళలను వేధించినట్లు వీరిపై ఆరోపణలు నమోదయ్యాయి.
బ్రిటన్ అధికారుల అభ్యర్థన మేరకే టేట్ సోదరులను అదుపులోకి తీసుకున్నట్లు యూఎస్ మార్షల్ సర్వీస్ వెల్లడించింది.
వచ్చే వారం వీరిద్దరినీ మయామీ ఫెడరల్ కోర్టులో హాజరుపరచనున్నట్లు అధికారులు తెలిపారు.