Village Hemarathana: బాలికపై అసభ్య ప్రవర్తన.. శ్రీలంక బౌద్ధ సన్యాసి అరెస్టు
ఈ వార్తాకథనం ఏంటి
శ్రీలంకలో సంచలనం రేపిన లైంగిక వేధింపుల కేసులో 71 ఏళ్ల బౌద్ధ సన్యాసి పల్లెగామ హేమరథనను పోలీసులు అరెస్టు చేశారు. 15 ఏళ్ల బాలికను లైంగికంగా వేధించారన్న ఆరోపణల నేపథ్యంలో ఈ చర్యలు తీసుకున్నట్లు శనివారం అధికారులు వెల్లడించారు. హేమరథన దేశంలోని ప్రముఖ బౌద్ధ ఆలయానికి ప్రధాన భిక్షువుగా సేవలందిస్తున్నట్లు సమాచారం. ఈ కేసులో బాలిక తల్లి పాత్ర కూడా ఉన్నట్లు విచారణలో తేలడంతో, ఆమెపై కూడా అనురాధపుర మేజిస్ట్రేట్ కోర్టు అరెస్టు వారెంట్ జారీ చేసింది. బాలికపై జరిగిన అకృత్యానికి ఆమె సహకరించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
వివరాలు
బాలిక తల్లి కూడా అరెస్టు
ఆలయ ప్రాంగణంలో ఈ ఘటన జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. గత మార్చిలో ఒక బాలికను అపహరించి అక్రమంగా నిర్బంధించారంటూ ఫిర్యాదు నమోదైంది. అనంతరం పోలీసులు దర్యాప్తు ప్రారంభించగా, విచారణలో మరిన్ని షాకింగ్ వివరాలు వెలుగులోకి వచ్చినట్లు తెలిసింది. ప్రస్తుతం కొలంబోలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రి ఎమర్జెన్సీ విభాగంలో చికిత్స పొందుతున్న సమయంలో హేమరథనను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అదే సమయంలో బాలిక తల్లిని కూడా అరెస్టు చేసినట్లు అధికారులు వెల్లడించారు.