Donald Trump: హష్ మనీ కేసులో డొనాల్డ్ ట్రంప్‌కు సుప్రీంకోర్టులో చుక్కెదురు
ఈ వార్తాకథనం ఏంటి
డొనాల్డ్ ట్రంప్‌కు హష్ మనీ (Hush Money Case) కేసులో ఎదురుదెబ్బ తగిలింది.
అమెరికా మాజీ అధ్యక్షుడు, కాబోయే అధ్యక్షుడిగా ఉన్న ట్రంప్, న్యూయార్క్ న్యాయమూర్తి జువాన్ ఎం. మెర్చన్ ప్రకటించిన శిక్ష ఆదేశాలను నిలిపివేయాలని సుప్రీం కోర్టును ఆశ్రయించారు.
అయితే, ట్రంప్ అభ్యర్థనను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. ఈ పరిణామాల మధ్య, న్యూయార్క్ కోర్టు జడ్జి శుక్రవారం ట్రంప్‌కు శిక్షను ఖరారు చేయనున్నారు.
ఫలితంగా, శిక్ష ఖరారైనప్పటికీ, అమెరికా శ్వేతసౌధంలో అడుగుపెట్టే తొలి శిక్ష ఖరారైన అధ్యక్షుడిగా ట్రంప్ నిలవవచ్చు.
వివరాలు
శిక్ష నిరవధికంగా వాయిదా
ఈ హష్ మనీ కేసులో ట్రంప్ దోషిగా తేలినప్పటికీ, గత ఏడాది నవంబరులోనే న్యాయస్థానం శిక్షను ఖరారు చేయాల్సింది.
కానీ అదే సమయంలో ట్రంప్ అమెరికా నూతన అధ్యక్షుడిగా ఎన్నిక కావడంతో, క్రిమినల్ విచారణలో ఆయనకు రక్షణ ఉంటుందని నమ్మి సుప్రీం కోర్టును ఆశ్రయించారు.
అప్పట్లో న్యాయస్థానం కేసు శిక్షను నిరవధికంగా వాయిదా వేసింది. కానీ, ఆయనకు రక్షణ కల్పించే అవకాశం లేదని తీర్పు ఇచ్చింది.
జనవరి 10న ట్రంప్‌కు శిక్ష విధిస్తానని న్యూయార్క్ జడ్జి ఇటీవల ఆదేశాలు జారీ చేశారు. అయితే, శిక్షను అనుభవించకుండానే డిశ్చార్జ్ పొందే అవకాశముందని సూచించారు.
వివరాలు
హష్ మనీ కేసు నేపథ్యం:
2016 అధ్యక్ష ఎన్నికల సమయంలో,శృంగార తార స్టార్మీ డానియల్స్‌తో ట్రంప్ గడిపారనే ఆరోపణలు ఉన్నాయి.
ఆమె నోరువిప్పకుండా ఉండేందుకు ట్రంప్ తన న్యాయవాది ద్వారా ఆమెకు 1.30 లక్షల డాలర్ల హష్ మనీ ఇచ్చారని ఆరోపించారు.
ఈ మొత్తం ఎన్నికల ప్రచార నిధుల నుంచి తీసుకుని,రికార్డులను తారుమారు చేశారని అభియోగాలు ఉన్నాయి.
ట్రంప్‌పై మొత్తం 34 నేర ఆరోపణలు నమోదయ్యాయి. ఆరు వారాల విచారణ అనంతరం, ట్రంప్ చేసిన అన్ని నేరారోపణలు నిజమని 12 మంది సభ్యులతో కూడిన ధర్మాసనం తీర్పు ఇచ్చింది.
స్టార్మీ డానియల్స్ కోర్టులో వాంగ్మూలం ఇచ్చి, ట్రంప్‌తో గడిపిన ఏకాంత క్షణాలు వాస్తవమని ధ్రువీకరించారు. ఆమెతోపాటు 22 మంది సాక్షుల వాంగ్మూలాల ఆధారంగా ట్రంప్ దోషిగా తేలారు.