Nepal Floods: చుట్టూ వరద నీరు.. టీషర్ట్ ఊపి హెలికాప్టర్‌ను రప్పించిన బాలుడు
ఈ వార్తాకథనం ఏంటి
నేపాల్‌లో వరద ప్రభావిత ప్రాంతాల్లో చిక్కుకుపోయిన వారిని రక్షించేందుకు సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. పలుచోట్ల హెలికాప్టర్ల ద్వారా బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఈ క్రమంలో ఆకస్మిక వరదల్లో చిక్కుకున్న ఓ బాలుడు సమయస్ఫూర్తితో వ్యవహరించి ప్రాణాలు కాపాడుకున్న ఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఆకస్మిక వరదలకు గురైన ఓ ఇంట్లో బాలుడు చిక్కుకుపోయాడు. సహాయం కోసం ఎదురుచూస్తున్న సమయంలో హెలికాప్టర్ శబ్దం వినిపించింది. వెంటనే అతడు భవనం పైకి చేరాడు. తన ఒంటిపై ఉన్న టీషర్ట్‌ను తీసి గాల్లో అటూఇటూ ఊపుతూ హెలికాప్టర్ సిబ్బంది దృష్టిని ఆకర్షించాడు.
వివరాలు
సహాయక చర్యలు ముమ్మరం
బాలుడి సంకేతాన్ని గమనించిన హెలికాప్టర్ వెంటనే ఆ భవనం సమీపానికి చేరుకుంది. అయితే హెలికాప్టర్ దిగేందుకు అనువైన ప్రదేశం లేకపోవడంతో.. గాల్లోనే చక్కర్లు కొడుతూ బాలుడికి అత్యంత సమీపంగా వచ్చింది.
ఈ సమయంలో సిబ్బంది సూచనల మేరకు బాలుడు హెలికాప్టర్ ల్యాండింగ్ స్కిడ్‌ను పట్టుకుని దానిపైకి ఎక్కాడు.
అనంతరం అతడిని సురక్షితంగా హెలికాప్టర్‌లోకి చేర్చారు ఈ ఘటనను సమీపంలో ఉన్నవారు వీడియో తీసినట్లు తెలుస్తోంది.
బాలుడిని రక్షించిన వెంటనే అక్కడున్న వారు ఆనందంతో కేరింతలు కొట్టారు. ఆ శబ్దాలు కూడా వీడియోలో వినిపిస్తున్నాయి.
నేపాల్‌లో కొనసాగుతున్న సహాయక చర్యల్లో హెలికాప్టర్ రెస్క్యూలు కీలకంగా మారాయి
ట్విట్టర్ పోస్ట్ చేయండి
వైరలవుతున్న వీడియో
🇳🇵 The house was already sitting in the river, then a boy climbed onto the roof and started waving his T-shirt at the sky.
— Mario Nawfal (@MarioNawfal) August 29, 2026
That was the only signal he had... Then a Nepal Army helicopter dropped in close enough for a soldier to grab his hand and pull him off the roof.
Hundreds…